Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగాల్ సీఎంకు జెర్సీ బహుకరించిన మెస్సీ

Lionel Messi gifts West Bengal CM Mamata Banerjee special Barcelona jersey, Didi No. 10

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియెనల్‌ మెస్సీకి ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఈ అర్జెంటీనా ఆటగాడికి మన దేశంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇంతటి క్రేజ్‌ ఉన్న ఈ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒక ప్రత్యేక బహుమతిని పంపారు. మెస్సీ, 'దీదీ నం 10' అనే జెర్సీని మమతా బెనర్జీకి స్పెషల్‌ గిఫ్ట్‌గా పంపించారు.

దేశంలోని మొత్తం 6 స్టేడియాల్లో

దేశంలోని మొత్తం 6 స్టేడియాల్లో

‘నా స్నేహితురాలికి శుభాకాంక్షలు మీ మెస్సీ'అనే సందేశాన్ని జెర్సీ మీద​ ప్రింట్‌ చేయించారు. గతేడాది ఫిఫా యూ - 17(ఫిఫా అండర్‌ సెవంటీన్‌ వరల్డ్‌ కప్‌)ని భారతదేశంలో నిర్వహించారు. దాని ఏర్పాట్లు చూసుకుని సక్రమంగా నిర్వహించడమే ఈ ప్రత్యేక బహుమానం పంపడానికి కారణం. దేశంలోని మొత్తం 6 స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఫైనల్‌ మ్యాచ్‌ కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగింది.

జెర్సీని ప్రత్యేక బహుమతిగా

జెర్సీని ప్రత్యేక బహుమతిగా

ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు దీదీని అభినందిస్తూ.. మెస్సీ ఈ జెర్సీని ప్రత్యేక బహుమతిగా అందజేశారు. గతంలో డియాగో మారడోనా, రొమారియో, రోనాల్డో వంటి దిగ్గజ క్రీడాకారులు ధరించిన ఈ జెర్సీని మెస్సీ, దీదీ గౌరవార్థం ఆమెకి బహుకరించారు. కొన్నేళ్లుగా బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న లియోనల్ మెస్సీ.. ఆ క్లబ్ ద్వారానే బహుమతిని పంపారు.

నెక్స్ట్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులకు

నెక్స్ట్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులకు

బార్సిలోనా లెజెండ్స్ ఈ జెర్సీని నెక్స్ట్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులకు అందజేశారు. ఈ విషయం గురించి ఫౌండేషన్‌ స్థాపకుడు కౌషిక్‌ మౌలిక్‌ ‘ఈ జెర్సీని వారు దీదీకి స్వయంగా అప్పగించడానికి కుదరక పోవడంతో మాకు అందచేశారు. దీన్ని సీఎమ్‌కు అందించడం మా బాధ్యత. ఇందుకు గాను మేము ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంది.'

అర్జెంటీనా, వెనిజులాల ఫ్రేండ్లీ మ్యాచ్‌

అర్జెంటీనా, వెనిజులాల ఫ్రేండ్లీ మ్యాచ్‌

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన అపాయింట్‌మెంట్‌‌ను బట్టి వారు ఆమెకు జెర్సీని బహుకరించనున్నారు. లియోనల్‌ మెస్పి 2011లో అర్జెంటీనా, వెనిజులాల మధ్య జరిగిన ఫ్రేండ్లీ మ్యాచ్‌ కోసం తొలిసారి కోల్‌కతా సాల్ట్‌ లేక్‌ స్టేడియానికి వచ్చారు.

Story first published: Friday, October 5, 2018, 12:22 [IST]
Other articles published on Oct 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+