Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి చేదు అనుభవం

Lionel Messi: లీగ్స్ కప్ ఫైనల్లో ఇంటర్ మయామీ స్టార్ లియోనెల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ జట్టు 0-3 తేడాతో సియాటెల్ సౌండర్స్ చేతిలో ఓటమి పాలైంది. సియాటెల్‌లోని లుమెన్ ఫీల్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 69,314 మంది అభిమానులు వీక్షించారు. ఈ విజయం ద్వారా సియాటెల్ సౌండర్స్ తమ మేజర్ నార్త్ అమెరికన్ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

సియాటెల్ సౌండర్స్ ఆధిపత్యం
ఫైనల్ మ్యాచ్‌లో సియాటెల్ సౌండర్స్ తమ ఆధిపత్యాన్ని మ్యాచ్ ప్రారంభం నుంచే చాటుకుంది. మ్యాచ్ 26వ నిమిషంలో ఓసాజే డి రోసారియో హెడర్‌తో మొదటి గోల్ కొట్టి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అనంతరం రెండో అర్థభాగంలో అలెక్స్ రోల్డన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌ గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. మ్యాచ్ ముగిసే ముందు 89వ నిమిషంలో పాల్ రోత్రాక్ మూడో గోల్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.

Lionel Messi Faces Bitter Defeat in Leagues Cup Final Against Seattle Sounders

మెస్సీకి నిరాశ.. కీలకమైన మిస్
మయామీ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. సియాటెల్ డిఫెన్స్ వారిని కట్టడి చేసింది. లియోనెల్ మెస్సీ కొట్టిన ఓ హెడర్‌ను జాక్సన్ రాగెన్ అడ్డుకోగా.. లుయిస్ సువారెజ్ ఇచ్చిన ఒక మంచి పాస్‌ను గోల్ పోస్ట్‌పైకి కొట్టాడు. గోల్ కొట్టడంలో మెస్సీ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తాడని పేరున్నా.. ఈ సారి మాత్రం సులభమైన అవకాశాన్ని కోల్పోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మయామీకి 60వ నిమిషంలో మరో మంచి అవకాశం లభించినప్పటికీ టెడియో అలెండే అది మిస్ చేశాడు.

చరిత్ర సృష్టించిన సియాటెల్ సౌండర్స్
ఈ విజయం సియాటెల్ సౌండర్స్ జట్టుకు లీగ్స్ కప్ ను సాధించి పెట్టడమే కాకుండా.. వారి చరిత్రలో మరో మైలురాయిని చేర్చింది. ఇప్పటికే రెండు MLS కప్స్, ఒక సపోర్టర్స్ షీల్డ్, 4 యూఎస్ ఓపెన్ కప్స్, ఒక కాన్కాకాఫ్ ఛాంపియన్స్ కప్ ఉన్న ఈ జట్టుకు లీగ్స్ కప్ కూడా చేరింది. ఇంటర్‌ మయామీ జట్టు జీతాల బిల్లు సియాటెల్ జట్టు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ (మయామీ $46.8 మిలియన్లు, సియాటెల్ $16.7 మిలియన్లు), సియాటెల్ తమ కఠినమైన డిఫెన్స్‌తో విజయం సాధించింది.

Story first published: Monday, September 1, 2025, 11:00 [IST]
Other articles published on Sep 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+