FIFA World Cup 2026: కన్నీటిపర్యంతమైన మెస్సీ! (వీడియో)
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-జె ఓపెనింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఘనవిజయం సాధించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన జట్టు తరఫున తొలి గోల్ చేసిన అనంతరం మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తాను ఎందుకు అంత భావోద్వేగానికి లోనయ్యాడో మెస్సీ స్వయంగా వెల్లడించాడు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో 38 ఏళ్ల మెస్సీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అల్జీరియాపై ఏకంగా హ్యాట్రిక్ గోల్స్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో తన మొదటి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇదే సమయంలో ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోస్ రికార్డును కూడా మెస్సీ సమం చేశాడు. అర్జెంటీనాను 3-0తో గెలిపించి అభిమానులను ఖుషీ చేసినప్పటికీ.. తొలి గోల్ తర్వాత మెస్సీ ఎందుకు కన్నీరు పెట్టుకున్నాడనేది అందరినీ అయోమయానికి గురిచేసింది.

మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ తన కన్నీళ్ల వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు. ఈ భావోద్వేగానికి ఫుట్‌బాల్‌కు ఎలాంటి సంబంధం లేదని.. గత కొన్ని రోజులుగా తాను వ్యక్తిగత జీవితంలో మానసికంగా చాలా కష్టమైన కాలాన్ని ఎదుర్కొన్నానని వెల్లడించాడు. "దీనితో ఆటకు ఎలాంటి సంబంధం లేదు.. నేను కొన్ని క్లిష్టమైన రోజులను అనుభవించాను. ఇది పూర్తిగా క్రీడలకు బయట జరిగిన విషయం" అని లియోనెల్ మెస్సీ స్పష్టం చేశాడు. అయితే ఆ సమస్య ఏంటనేది మాత్రం మెస్సీ పూర్తిగా బయటపెట్టలేదు.
కష్టసమయంలో తనకు అండగా నిలిచిన అర్జెంటీనా జట్టు సభ్యులకు, యాజమాన్యానికి మెస్సీ కృతజ్ఞతలు తెలిపాడు. "నేను మానసికంగా కోలుకునేలా చేయడంలో నా సహచర ఆటగాళ్లు, మొత్తం ప్రతినిధి బృందం ఎంతో కృషి చేశారు. వారందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడనై ఉంటాను" అని పేర్కొన్నాడు. అలాగే తన సుదీర్ఘ కెరీర్‌లో సాధించిన విజయాల తర్వాత, ప్రస్తుతం తాను అనుభవిస్తున్న ఈ దశ తన కెరీర్‌కే ఒక ప్రత్యేకమైన తీపి జ్ఞాపకం లాంటిదని మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు అల్జీరియాపై 3-0తో సాధించిన ఈ అద్భుత విజయంపై ఆ జట్టు మేనేజర్ లియోనెల్ స్కలోని స్పందించాడు. మెస్సీ ఆటతీరును ప్రశంసించడానికి తన దగ్గర మాటలు లేవని, అతను నిజంగా అద్భుతమైన ఆటగాడంటూ కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications