Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యామిలీతో ఇబిజా ద్వీపంలో హాలిడే ట్రిప్‌‌: జాలీగా మెస్సీ (ఫోటోలు)

Lionel Messi: Barcelona star enjoys break in Ibiza with family

హైదరాబాద్: ఇటీవల రష్యా వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా జట్టు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌తోనే నిష్క్రమించడంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల చెదిరింది. వరల్డ్ కప్ తర్వాత లియోనల్ మెస్సీ జాడ కనిపించలేదంటూ తీవ్ర విమర్శలు సైతం వినిపించాయి.

కానీ, మెస్సీ మాత్రం ఫ్యామిలీతో కలిసి హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇబిజా ద్వీపంలో కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నాడు. ఇందుకు సంబంధింఛిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫిఫా వరల్డ్‌కప్‌లో టోర్నీలో అర్జెంటీనా నాకౌట్ వరకు చేరుకుంది.

Lionel Messi: Barcelona star enjoys break in Ibiza with family

ఫ్రాన్స్‌తో జరిగిన నాకౌట్‌ పోరులో అర్జెంటీనా 4-3 తేడాతో ఓటమి పాలైంది. ఎంబాపే వరుసగా రెండు అద్భుత గోల్స్‌ అందించి ఫ్రాన్స్‌కు విజయాన్ని అందించాడు. తొలి అర్థబాగం వరకు ఇరు జట్లు సమానంగా పోరాడాయి. అర్జెంటీనా ఆటగాడు మార్కస్‌ రోజో 11వ నిమిషంలో చేసిన ఫౌల్‌తో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది.

దానిని గ్రీజ్‌మన్‌ గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత నుంచి గోల్‌ కోసం అర్జెంటీనా తీవ్రంగా పోరాడింది. ఈ క్రమంలో 41నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మారియా తొలి గోల్‌ చేసి స్కోరు 1-1కి సమం చేశాడు. దీంతో ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో తొలి అర్ధభాగం 1-1తో సమంగా ముగిసింది.

ఆ తర్వాత మొదలైన రెండో అర్ధభాగంలో అర్జెంటీనాకు 48నిమిషంలో మరో గోల్‌ కొట్టింది. మెస్సీ అందించిన పాస్‌ను మెర్కాడో నేరుగా గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. అప్పటి నుంచి పుంజుకున్న ఫ్రాన్స్‌ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడుతూ వచ్చింది. 57వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజమిన్‌ పెవార్డ్‌ గోల్‌ అందించడంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి.

Lionel Messi: Barcelona star enjoys break in Ibiza with family

ఈ తరుణంలో అనూహ్యంగా కైలియన్‌ మొబప్పె 64, 68వ నిమిషంలో రెచ్చిపోయి ఆడి రెండు వరుస గోల్‌లతో చెలరేగిపోయాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ 4-2తో ఫ్రాన్స్‌ చేతుల్లోకి వెళ్లింది. తర్వాతి నుంచి అర్జెంటీనా ఎంత పోరాడినా ఇంజారీ టైమ్‌లో(90+3) మరో గోల్‌ మాత్రమే చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్‌ కూడా చేయకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. తాను ఆడిన ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో(8 మ్యాచ్‌లు) ఇప్పటివరకు మెస్సీ ఒక్క గోల్‌ చేయకపోవడం గమనార్హం. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కేవలం ఐదోసారి మాత్రమే అర్జెంటీనా తన ప్రత్యర్థి జట్టుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్‌ సమర్పించుకుంది.

1986లో బెల్జియం (యూఎస్‌ఎస్‌ఆర్‌ చేతిలో 3-4తో ఓటమి) తర్వాత కనీసం మూడు గోల్స్‌ చేసి ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. ఇదిలా ఉంటే జులై 15(ఆదివారం) మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో క్రొయేషియాపై ఫ్రాన్స్ 4-2తేడాతో విజయం సాధించి రెండోసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Friday, July 20, 2018, 19:26 [IST]
Other articles published on Jul 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+