For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదో సారి గోల్డెన్ బూట్ అవార్డు రికార్డులకెక్కిన మెస్సీ

Lionel Messi bags fifth Golden Shoe award: I didnt expect all this

హైదరాబాద్: లియోనెల్ మెస్సీ యూరోపియన్ సాకర్ లీగ్‌లో చేసిన గోల్స్ ఆధారంగా ఫుట్‌బాల్‌లో అత్యుత్తమంగా భావించే గోల్డెన్ షూ(గోల్డెన్ బూట్) అవార్డు అందుకున్నాడు. దీంతో క్రిస్టియన్ రొనాల్డొ చేసిన నాలుగు గోల్డెన్ బూట్ అవార్డులను కొల్లగొట్టాడు. స్పానిష్ లీగ్ చివరి సీజన్‌లో బార్సిలోనా టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా యూరప్ దేశీవాళీ లీగ్‌లో లీడ్ స్కోరర్‌గా నిలిచిన మెస్సీ .. ఈజిప్ట్ ప్లేయర్ అయిన మొహమ్మద్ సలాహ్‌(32 గోల్స్)తో ఓడించాడు.

ఇలా మెస్సీ ఈ అవార్డును 2009-10 (34), 2011-12 (50, 2012-13 (46), 2016-17 (37)లతో నాలుగు సార్లు గెలుచుకున్న మెస్సీ మరోసారి 2017-18కి కూడా ఎంపికై అందరినీ ఆశ్చర్యానికి గుర్తు చేశాడు. 'నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. కానీ, నేను ఆడటం మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ ఊహించలేదు. వృత్తిపరమైన ఆటగాడిలా ఎదగాలని కలలు కన్నాను. నేను పడిన కఠిన శ్రమకు, కృషికి నాకు సహకరించిన జట్టు సహచరులకు కృతజ్ఞతలు. నాతో పాటు ఆడుతోన్న ఆటగాళ్లు ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లు' అని కొనియాడాడు.

బార్సిలోనా ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచిన మెస్సీ 655 గేమ్స్ ఆడి 572 గోల్స్ చేశాడు. యూరోపియన్ స్పోర్ట్స్ మీడియా(వార్తా పత్రికలు, మ్యాగజైన్స్) మెస్సీకి ఈ గోల్డెన్ షూ అవార్డును అందజేశాయి.

దీంతో పాటుగా మెస్సీ ఖాతాలో 5 గోల్డెన్ బాల్స్ అవార్డులు, 4 సిల్వర్ బాల్స్, 1 కాంస్య బాల్ అవార్డు ఉన్నాయి. మెస్సీతో పాటుగా క్రిస్టియన్ రొనాల్డో ప్రపంచ అత్యుత్తమ అవార్డులను ఐదు సార్లు గెలుచుకున్నాడు. వీరే కాక జోహాన్ క్రఫ్, మిచెల్ ప్లాటిని, మార్కొ వాన్ బాస్టన్‌లు సైతం ఒక్కొక్కరు మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు.

Story first published: Thursday, December 20, 2018, 15:07 [IST]
Other articles published on Dec 20, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+