మ్యాచ్ మధ్యలో పిడుగు.. ప్లేయర్ మృతి (Video)
ఇండోనేషియాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో పిడుగుపాటుకు గురై ఓ ప్లేయర్ మృతి చెందాడు. అప్పటివరకు హుషారుగా తమ జట్టును గెలిపించడానికి ప్రయత్నించిన అతడు ప్రకృతి వైపరీత్యానికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పశ్చిమ జావాలోని సిలివాంగి ఫుట్ బాల్ స్టేడియంలో శనివారం సాయంత్రం 2 FLO FC బాండుంగ్ - FBI సుబాంగ్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. బాల్ కదలికను బట్టి సుబాంగ్ జట్టుకు చెందిన సెప్టైన్ రహర్జా మైదానంలో కదులుతున్నాడు. అయితే ఒక్కసారిగా రహర్జా మీదకు పిడుగు పడింది.

వెంటనే సహచర ఆటగాళ్లు రహర్జాను ఆసుపత్రికి తరలించారు. మైదానంలో ఊపిరితోనే ఉన్నాడు. అయితే కాలిన తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలు విడిచాడు. కాగా, రహర్జా వయసు 35 ఏళ్లు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇండోనేషియాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే ప్రథమం కాదు.గతేడాది తూర్పు జావాలో ఓ ఆటగాడిపై పిడుగు పడింది. బోజోనెగోరోలో నిర్వహించిన సోరటిన్ U-13 కప్‌లో ఒక యువ ఫుట్‌బాల్ ఆటగాడు పిడుగుపాటుకు గురయ్యాడు. ఈ సంఘటనలో అతను మృత్యువును జయించాడు. అయితే 2023లో బ్రెజిల్‌లో జరిగిన పిడుగుపాటు సంఘటనలో ఓ ఆటగాడు మరణించాడు.
సాధారణంగా మ్యాచ్ రిఫరీ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌ను నిర్వహిస్తారు. విపరీతమైన ఈదురుగాళ్లు ఉన్న నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని గతంలో ఈదురుగాళ్లు మ్యాచ్‌లు నిలిపివేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications