Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియన్ సూపర్ లీగ్: కేరళపై లూయిస్‌ చూపు

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌పై సంచలన విజయం తర్వాత ఢిల్లీ డైనమోస్‌ మిడ్‌ ఫీల్డర్‌ కీన్‌ లూయిస్‌ దృష్టి తదుపరి కేరళ బ్లాక్‌ బస్టర్స్‌పై పడింది. తెలివిగా ఢిల్లీ మూడో గోల్‌ సాధించడానికి బదారా బాద్జీకి చేయూతనిచ్చిన మిడ్‌ఫీల్డర్‌ కీన్‌ లూయిస్‌.. మ్యాచ్‌ అసాంతం పూర్తిగా నిమగ్నమై ఆడాడు.

వేడి వాతావరణంలో ప్రాక్టీస్‌ చేయడంతో విభిన్న వాతావరణం వల్ల కుర్రాళ్లలో చురుకుదనం పెరిగి చాలా బాగా ఆడారని, తమ జట్టు మెరుగ్గా ఆడినందు వల్లే మూడు పాయింట్లు పొందగలిగామని లూయిస్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. స్కోర్‌షీట్‌ బాగానే ఉన్నా ఆటలో భాగంగానే తాను తన సహచరులకు చేయూతనిచ్చానన్నాడు. వ్యక్తిగత విజయాల కంటే జట్టు గెలుపొందడమే తమకు ప్రధానం అని తెలిపాడు.

కేరళ జట్టుతో తానింత వరకూ ఆడలేదని, ఆ జట్టుతో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. రెండో హాఫ్‌ ప్రారంభం నాటికే ఆధిక్యత దిశగా తమ జట్టు నిలవడానికి కోచ్‌ల శిక్షణ ప్రధానమని వ్యాఖ్యానించాడు.

Lewis turns attention to Kerala Blasters after easy win against Chennaiyin

మా కంటే డైనమోస్‌ కొంచెం బెటరంతే!

తమ జట్టు కంటే ఢిల్లీ డైనమోస్‌ జట్టు బెటర్‌గా సంసిద్ధమైందని చెన్నైయిన్‌ ప్లేయర్‌ దూదూ ఒమాంగ్‌బేబీ అన్నాడు. 32వ నిమిషంలో దూదూ గోల్‌చేయడంతో రెండు జట్ల మధ్య స్కోర్‌ 1 - 3గా స్థిరపడింది. నైజీరియాకు చెందిన ఈ కుర్రాడు ఐఎస్‌ఎల్‌ లీగ్‌ మూడు ఎడిషన్లలో మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

2014లో పుణె సిటీకి, 2015లో గోవా సిటీకి ప్రాతినిధ్యం వహించిన దూదూ ఒమాంగ్‌బేబీ ఈ దఫా.. చెన్నైయిన్‌ జట్టు సభ్యుడిగా ఆడుతున్నాడు. గురువారం మ్యాచ్‌లో తాము సరిగ్గా మాత్రమే ఆడలేదని, ఢిల్లీ డైనమోస్‌ మెరుగ్గా ఆడారన్నాడు. కానీ ఇది ప్రారంభం మాత్రమేనని, ముందుకు వెళ్లడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందన్నాడు.

తమకు అభిమానుల నుంచి బోలెడంత మద్దతు లభించిందని, తాము ఇంకా పలు గేమ్‌లు ఆడాల్సి ఉందని, తమకు మంచి జట్టు ఉన్నా.. తాము కష్టపడి ఆడాల్సి ఉన్నదన్నాడు. తాము ప్రతి విభాగంలోనూ ప్రతి ఒక్కరం మెరుగ్గా తీర్చి దిద్దుకోవాల్సి ఉందని, ఢిల్లీ డైనమోస్‌ బాగా కౌంటర్‌ అటాకింగ్‌గా ఆడారని ప్రశంసించాడు.

గోవా మ్యాచ్‌ భద్రతకు 'బ్రిక్స్‌' అడ్డంకి

పనాజీ: జాతీయస్థాయిలో ఫుట్‌బాల్‌ ప్రోత్సాహానికి నిర్వహిస్తున్న ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని గోవా పోలీసులు తేల్చేశారు. సౌత్‌ గోవాలోని ఫటోర్డా 'జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం'లో శనివారం ఎఫ్‌సి పుణె సిటీ జట్టుతో ఎఫ్‌సి గోవా జట్టు తలపడనున్నది. కానీ ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించడం తమ వల్ల కాదని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (దక్షిణ) శేఖర్‌ ప్రభూ దేశాయ్‌ స్పష్టంచేశారు.

దీనికి కారణం ఈ నెల 15, 16 తేదీల్లో బ్రిక్స్‌ సదస్సుకు గోవా ఆతిథ్యం ఇవ్వడమేనట. భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు బ్రిక్స్‌ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. కనుక వారి భద్రత కోసం ముందస్తు మాక్‌ డ్రిల్స్‌, రిహార్సల్స్‌ నిర్వహణలో తాము బిజీగా ఉన్నామని శేఖర్‌ ప్రభూదేశాయ్‌ పేర్కొన్నారు.

ఈ సదస్సు సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గోవా సిటీ జట్టు ఆడుతుండటంతో భారీస్థాయిలో అభిమానులు స్టేడియంకు పోటెత్తే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇంతకుముందు భద్రత కోసం తాము విధులు నిర్వర్తించినందు వల్ల రూ.3.80 కోట్ల బకాయిలు చెల్లించనే లేదని పేర్కొంటూ గోవా పోలీసులు ఇప్పటికి పలుసార్లు రిమైండర్లు పంపినా జట్టు యాజమాన్యం ప్రతిస్పందిచక పోవడం గమనార్హం.

అయితే బకాయి బిల్లు చెల్లింపునకు, ఈ నెల 8న మ్యాచ్‌కు భద్రత కల్పనకు సంబంధం లేదని తాజాగా గోవా జట్టుకు పంపిన నోటీసులో సూపరింటెండెంట్‌ ప్రభూదేశాయి తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+