హైదరాబాద్: రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహాంతో పుట్‌బాల్ ఆడతానని తన కెరీర్‌లో ఐదో బెలోన్ డీఆర్ అవార్డుని అందుకున్న సందర్భంగా సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అన్నాడు. 2017 సంవత్సరానికి గాను ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బెలోన్ డీఆర్ అవార్డుని రొనాల్డో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ 'మరికొన్ని సంవత్సరాల పాటు ఇదే విధంగా పుట్‌బాల్ ఆడతా. మంచి ధోరణిలో పైటింగ్ కొనసాగుతుంది. మెస్సీ ఎలాగైతే తన జట్టు కోసం ఆడుతున్నాడో... నేను కూడా నా జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. ఏడాది చివరకు ఎవరు అత్యుత్తమంగా నిలుస్తారో చూద్దాం' అని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.