లేటే‘స్ట్’: ప్రియురాలితో మూడో పెళ్లికి సిద్ధమైన పీలే
రియోడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాట్ మాజీ దిగ్గజం పీలే త్వరలో తన ప్రియురాలిని వివాహం చేసుకోనున్నారు. ఇదివరకే ఇద్దర్ని వివాహామాడిన పీలే వారికి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. 75ఏళ్ల పీలే.. 42ఏళ్ల మార్సియా సిబెలేను వివాహం మంగళవారం జరగనుంది.
వీరిద్దరూ 2010 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని నెలల నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. తన పెళ్లి వార్తను పీలే స్వయంగా మీడియాకు తెలిపారు.1958, 1962, 1970లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ సొంతం చేసుకున్న బ్రెజిల్ జట్టులో పీలే కీలక ఆటగాడి ఉన్నాడు.
1363 మ్యాచ్ లాడిన పీలే 1281 గోల్స్ చేశాడు. ఇక వ్యక్తిగత జీవితానికొస్తే.. పీలే మొదట రోస్ మేరి ఛోల్బీని పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం కలిగారు. ఆ తర్వాత అస్సీరియా నాస్కిమెంటోతో జీవితాన్ని పంచుకున్నాడు.
ఆమెతో జోషువా, సెలెస్ట్ అనే ఇద్దరు కవలలకు పీలే తండ్రయ్యారు. కొంతకాలం తర్వాత ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్న పీలే.. తన ప్రియురాలితో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications