స్కాటిష్ ప్రీమియర్ షిప్‌లో హార్ట్స్ ఫుట్‌బాల్ క్లబ్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ లారెన్స్ షాంక్లాండ్ 50వ గోల్ నమోదు చేయడంతో హార్ట్స్ 1-0తో సెయింట్ జోన్‌స్టోన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు 15 లీగ్ మ్యాచ్‌లు ఆడిన హార్ట్స్ టీమ్ 12 విజయాలు నమోదు చేసింది.
ఆ సాంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో హార్ట్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట ప్రారంభం నుంచి బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న హార్ట్స్ టీమ్.. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. కానీ సెయింట్ జాన్‌స్టోన్ డిఫెన్స్ విభాగం గోల్స్ చేయకుండా అడ్డుగా నిలిచింది.

హార్ట్స్ ప్లేయర్ల ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంది. 25వ నిమిషంలో హార్ట్స్‌కు గోల్ చేసే అవకాశం దక్కగా.. సెయింట్ జాన్‌స్టోన్ ప్లేయర్ దిమితర్ మిటోవ్ అడ్డుకున్నాడు. 39వ నిమిషంలో సెయింట్స్ టీమ్‌కు అవకాశం దక్కగా.. గోల్‌గా మలుచలేకపోయింది. 47వ నిమిషంలో హార్ట్స్ స్ట్రైకర్ అలన్ ఫోరెస్ట్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించే ప్రయత్నం చేయగా.. ఫలితం లభించలేదు.
ఇక 55వ నిమిషంలో సెయింట్స్ డిఫెండర్ ఆండ్రూ చేసిన తప్పిదం హార్ట్స్ టీమ్‌కు కలిసొచ్చింది. బంతిని అతను మిస్ జడ్జ్ చేయడంతో.. లారెన్స్ షాంక్లాండ్ సూపర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఇది అతనికి 50వ గోల్. 12 అడుగుల దూరం నుంచి అతను బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.