షిల్లాంగ్: ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐ-లీగ్ పదో ఎడిషన్‌లో పాయింట్ల పట్టికలో టాప్ 3 స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్‌సి. అందుకోసం ముగ్గురు ప్రముఖ ఆటగాళ్లను తన టీమ్‌లో చేర్చుకున్నది.
ఫాబియో పెనా హెన్రిక్యును కాపాడుకోవడంతోపాటు రొమేనియన్ డిఫెండర్ డాన్ గెలూ ఇగ్నాత్, జపాన్ మిడ్ ఫీల్డర్ యుతా కినోవాకీ, కమరూనియన్ స్ట్రయికర్ అసెర్ ఫెర్రిక్ డిపాండలతో కాంట్రాక్టులపై షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్‌సి యాజమాన్యం సంతకాలు చేసింది. గత సీజన్‌లో ఫాబియో పెనా హెన్రిక్యు నాలుగు గోల్స్ చేయడంతో వరుసగా రెండో ఏడాది కూడా షిల్లాంగ్ లాజోంగ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ బ్రెజిలియన్ ప్లేయర్ అత్యంత సమర్థుడని, వివిధ మ్యాచ్‌ల్లో క్లబ్ జట్టుకు సహాయకారిగా ఉంటాడని షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి హెడ్ కోచ్ థాంగ్ బాయ్ సింగ్టో పేర్కొన్నాడు. రోమేనియా నుంచి భారత్ ఫుట్‌బాల్ క్లబ్ లాజోంగ్ జట్టులో చేరిన తొలి ప్లేయర్ ఇగ్నాత్ కాగా, క్రితంసారి ఐజ్వాల్ ఎఫ్ సి జట్టులో ఆడిన కినోవాకి ఈ దఫా లాజోంగ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.

క్రితంసారి కామెరూన్ స్ట్రయికర్ అసెర్ ఫెర్రిక్, డిపాండ గత సీజన్‌లో డిఎస్ కె శివాజీయన్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన వారే. ఇగ్నాత్‌తోపాటు జపాన్ మిడ్ ఫీల్డర్ బహుముఖ ప్రజ్నాశాలిగా జట్టుకు పెద్దదిక్కుగా మారాడు. మరోవైపు బ్యాక్ లైన్‌పై జట్టును పరిరక్షించుకోవడంలో ముందు వరుసలో నిలుస్తాడని థాంగ్ బోయి సింగ్టో వ్యాఖ్యానించాడు.
పోలండ్, లాత్వియాకు బయలుదేరి వెళ్లకముందు కినోవాకి నాలుగేళ్లపాటు జపాన్ లోని క్యోటో సంగా ఎఫ్ సి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బిఎఫ్ సి డౌగావ్పిల్స్, ఎనర్జెట్య్క్ గ్రైఫినో జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. క్యోటో షికో ఎస్ సిలో డౌగావ్పిల్స్ జట్టుకు ఒక ఏడాది ప్రాతినిధ్యం వహించిన కినోవాకీ తర్వాత సొంత దేశ జాతీయ జట్టు తరఫునే ఆడాడు. 2015 - 16లో ఐ - లీగ్ టోర్నీలో ఐజ్వాల్ ఎఫ్ సి జట్టు తరపున రెండు గోల్స్ మాత్రమే చేశాడు కినోవాకీ.
ఇక రొమేనియన్ ప్లేయర్ ఇగ్నాత్ కెరీర్ పూర్తిగా సొంతదేశంలోనే కొనసాగింది. ఇటీవల జోర్డాన్ లోని అల్ రమ్‌తా, థాట్ రాస్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. యువకుడిగా ఉన్నప్పుడు రొమేనియాలోని పలు జట్ల తరఫున 2004 - 14 మధ్య కాలంలో లిగా వన్, లిగా 2 టోర్నీల్లో ఆడాడు.
మరోవైపు దిపాండ అనే మరో ప్లేయర్ తన కెరీర్ 2008 నుంచి 2014 వరకు స్పెయిన్ లోని వాలెసియా బీ, లా రోడా, ఒలింపిక్ డి గ్జావియా, అల్జిరియా జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐ-లీగ్ టోర్నీలో గత ఏడాది డిఎస్ కె శివాజియన్ జట్టులో చేరడమే కాదు పుణె జట్టు తరఫున ఏడు గోల్స్ కూడా చేశాడు. తమకు అనుభవం గల ప్లేయర్లు, డిఫెన్స్ విభాగంలో లీడ్ అందుకునే వారు కావాలని కోచ్ సింగ్టో వ్యాఖ్యానించాడు.
డిపాండ వంటి ఆటగాళ్ల సేవలు తమ జట్టుకు పెద్ద దిక్కుగా ఉంటాడని చెప్పాడు. గత ఎడిషన్ లోనే యుతా ఒక ఉత్తమ మిడ్ ఫీల్డర్‌గా నిలిచాడని, ఆయనలోని ప్రతిభను గుర్తించే తమ మిడ్ ఫీల్డర్‌గా తీసుకున్నామని షింగ్టో తెలిపాడు. కెమెరియన్ స్ట్రయికర్ డిపాండ గత సీజన్ లో ఏడు గోల్స్ సాధించడంతోపాటు అటాకింగ్ లో కీలక భూమిక పోషించాడని సింగ్టో తెలిపాడు. ఈ ఏడాది మరింత మెరుగైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తాడని చెప్పాడు.