న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

బార్సిలోనా పైచేయి: రొనాల్డో అసంతృప్తి

By Pratap

మాడ్రిడ్‌: యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ 'లా లీగా'లో నువ్వా, నేనా అన్నట్లు ముందుకెళుతున్న బార్సిలోనా, రియల్‌ మాడ్రిడ్‌ జట్టుపై ఆధిక్యత సాధించింది. ఫార్వర్డ్‌ మాన్‌ లయన్డ్‌ మెస్సీ గాయంతో మ్యాచ్‌కు దూరమైనా.. లూయిస్‌ సౌరేజ్‌, నేయ్మార్‌ల సహకారంతో శనివారం స్పోర్టింగ్‌ జిజోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 - 0 తేడాతో ఘన విజయం సాధించడం గమనార్హం.

బార్సిలోనాకు గట్టి ప్రత్యర్థిగా భావిస్తున్న రియల్‌ మాడ్రిడ్‌ మాత్రం లాస్‌ పాల్మాస్‌తో జరిగిన మ్యాచ్‌ను 2 - 2 స్కోర్‌తో డ్రాగా ముగించింది. ప్రారంభంలో లాస్‌ పాల్మాస్‌ 2 - 1 స్కోర్‌ తేడాతో రియల్‌ మాడ్రిడ్‌పై ఆధిక్యత సాధించింది కూడా.

దీంతో మాడ్రిడ్‌ జట్టు యాజమాన్యం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు క్రిస్టియానా రొనాల్డోను రంగంలోకి దించడంతో స్కోర్‌ సమంగా మారి డ్రాగా ముగిసింది. లా లీగ్‌ టోర్నీ ప్రారంభ రోజుల నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన రియల్‌ మాడ్రిడ్‌ ఆటగాళ్లు శనివారం మ్యాచ్‌లో మెతక వైఖరి ప్రదర్శించిన తీరు ఆయనను అసంతృప్తికి గురిచేసింది.

La Liga: Unhappy Ronaldo subbed as Real held again, Barcelona close in

తమ డిఫెండర్లు మెతకగా వ్యవహరించడంతో నాలుగు రోజుల్లో రెండోసారి ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు రావడంతో రొనాల్డో అసంతృప్తి వ్యక్తంచేశాడు. తొలి హాఫ్‌ మ్యాచ్‌ తర్వాతే రియల్‌ మాడ్రిడ్‌ జట్టు కోలుకున్నది.

అవరోధాలను అధిగమించిన బార్సిలోనా

స్పోర్టింగ్‌ జిజోన క్రీడాకారులను దూకుడుగా అడ్డుకున్న బార్సిలోనా ఎఫ్‌సి జట్టు తొలుత అవరోధాలను అధిగమించింది. స్పోర్టింగ్‌తో జట్టు విజయంపై బార్సిలోనా కోచ్‌ లూయిస్‌ ఎన్‌రైక్యూ సంతృప్తి వ్యక్తంచేశారు.

'ఫలితం మ్యాచ్‌ ఫలితాన్ని తెలియజేయదు, 5 -0 స్కోర్‌తో గెలుపొందడం చాలా తేలిక అని అన్నారు. రెండో హాఫ్‌లో తమ ఆటగాళ్లు చాలా పేలవమైన ఆటతీరు ప్రదర్శించారని, స్పోర్టింగ్‌ జిజోన్‌కు విజయావకాశాలు ఉన్నా సద్వినియోగం చేసుకోలేదన్నాడు. అదృష్టవశాత్తు చివరి దశలో మూడ్‌ గోల్స్‌ చేయడం తమకు లాభించిందన్నాడ.ఒకానొక దశలో సౌరేజ్‌ మ్యాజిక్‌ బార్సిలోనాకు సావకాశంగా మారింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X