ఢిల్లీ-ముంబై మ్యాచ్ ‘లా లీగ’లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ ప్రారంభమైన మూడేళ్లలోనే అరుదైన చారిత్రక సన్నివేశానికి వేదికగా మారనున్నది. డిసెంబర్ మూడో తేదీన ఢిల్లీ డైనమోస్, ముంబై సిటీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంతర్జాతీయంగా ప్రత్యక్ష ప్రసారం కానున్నది. స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ షో పీస్ మ్యాచ్ 'ఎల్ క్లాసియో' ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంచేయనున్నది.
ఇది సహజంగా 'లా లీగ' జెయింట్స్, సంప్రదాయ ప్రత్యర్థులు ఎఫ్ సి బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ జట్ల మద్య జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారంచేయడంతో యూరప్‌లో ప్రజాదరణ పొందింది. ఇటీవలే 'ఎల్ క్లాసియో' భారత్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత్‌లో 'లా లీగ' టోర్నీతోపాటు ఐఎస్ఎల్ టోర్నీకి ప్రజాదరణ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, ముంబైలోని ఖార్ జింఖానా స్టేడియంలోని ఫుడ్, బేవరెజెస్ స్టాళ్లు, ఫ్యాన్స్ కార్యక్రమాలను ప్రసారంచేస్తారు. ప్రత్యక్ష ప్రసారాల కోసం న్యూఢిల్లీలో లా లీగ మాజీ స్టార్ లూయిస్ గార్సియా, ముంబైలో ఫ్రెడెరిక్ కానౌటే అందుబాటులో ఉంటారు.
భారత్‌లో ఐఎస్ఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలపై లా లీగ అధ్యక్షుడు జావియర్ తెబాస్ స్పందిస్తూ 'లా లీగకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడమే మా లక్ష్యం. ప్రపంచంలోకెల్లా గొప్ప లీగ్‌గా ఎస్టాబ్లిష్ చేయడమే మా లక్ష్యం. మా అభిమానులకు మరింత చేరువలోకి వెళ్లాలన్నదే మా వ్యూహం' అని తెలిపాడు.
'భారత్‌లో లా లీగ జెయింట్స్ రియల్ మాడ్రిడ్, ఎఫ్ సి బార్సిలోనా జట్లకు భారీ ప్రజాదరణ ఉంది. మా ఫ్యాన్స్ పట్ల మక్కువతో వారికి చేరువ కావడమే మా లక్ష్యం. ఐఎస్ఎల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒక అనుభవం పొందాలన్నదే మా ఆలోచన. భారతదేశంలో మా పర్యటన గొప్ప శుభారంభాన్ని అందుకుంటుందని భావిస్తున్నాం' అని చెప్పాడు.

ఫిఫా ర్యాంకింగ్స్ మారని భారత్ ర్యాంకింగ్
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం నవంబర్ లో ఎటువంటి పురోగతి లేదు. గతంలో సాధించిన 137వ స్థానం వద్దే భారత్ నిలబడి పోగా, బ్రెజిల్ మాత్రం రెండో స్థానానికి దూసుకొచ్చింది. ప్రస్తుతం బ్రిటన్ కోచ్ స్టీఫెన్ కాంస్టాటైన్ శిక్షణలో తర్పీదు పొందుతున్న భారత్ జట్టు 217 పాయింట్లతో ఆసియా ఖండంలో 22వ స్థానంలో నిలిచింది. 2010 ఆగస్టు నుంచి భారత్ బెస్ట్ ర్యాంక్ ఇది. గత నెలలో 230 పాయింట్లు సాధించిన భారత జట్టు 13 పాయింట్లు కోల్పోయింది. దీనికి కారణం రెండు ఇంటర్నేషనల్ విండోస్‌లో పాల్గొనకపోవడమే.

చివరిగా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో
చివరిగా భారత్ జట్టు గత సెప్టెంబర్ నాలుగో తేదీన పౌర్టో రికోతో ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొన్నది. ఆసియాలో టాప్ టీంగా ఉన్న ఇరాన్ సైతం తాజా ఫిఫా ర్యాంకింగ్స్‌లో మూడు పాయింట్లు తగ్గాయి. కానీ ఆసియాలో మాత్రం టాప్ జట్టుగానే కొనసాగుతున్నది. రెండో స్థానంలో దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా కొనసాగుతున్నాయి. గత వారం సిరియాతో జరిగిన 2018 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో గోల్స్ లేని డ్రాగా ముగించడంతో ఇరాన్ ప్రస్తుతం అంతర్జాతీయంగా 30వ స్థానానికి పడిపోయింది.

రెండో స్థానంలో బ్రెజిల్
ఇక ఐదుసార్లు ప్రపంచ కప్ గెలుచుకున్న బ్రెజిల్ రెండో స్థానానికి దూసుకెళ్లింది. తద్వారా తన చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనాను దాటేసి ముందుకు వెళ్లిపోయింది. గత ఆరు కొన్మెబొల్ గ్రూప్ వరల్డ్ కప్ క్వాలిఫయ్యర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో బ్రెజిల్ తన స్థానాన్ని మెరుగు పరుచుకున్నది. తొలి నాలుగు వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో విజయం సాధించినా జర్మనీ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక అర్జెంటీనా కొన్బెమొల్ వరల్డ్ కప్ క్వాలిఫయ్యర్స్ మ్యాచ్‌లలో 12 మ్యాచ్ లకు ఐదింట గెలుపొంది ఐదో స్థానంతో సరిపెట్టుకున్నది.

నాలుగోస్థానంలో చిలీ
కోపా అమెరికా చాంపియన్లు చిలీ టాప్ 10లో రెండు స్థానాలు పైకెగసి నాలుగోస్థానంలో స్థిర పడింది. మూడు వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ 10 స్థానాలు ముందుకు దూకేసి 23వ స్థానంలో నిలిచింది. ఆఫ్రికా దేశాల్లో సెనెగల్ టాప్ జట్టుగా నిలిచింది. ఆ జట్టు అంతర్జాతీయంగా 33వ స్థానంలో నిలవగా, గత నెల 783 పాయింట్ల నుంచి 755 పాయింట్లకు పడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications