Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లా లీగా: టాప్‌లో రియల్ మాడ్రిడ్.. కష్టాల్లో బార్సిలోనా

మాడ్రిడ్: చాంపియన్స్ గ్రూప్ దశకు చేరుకున్న లా లీగా టోర్నీలో ఈ వారమంతా ఈవెంట్‌ఫుల్‌గానే సాగింది. ఆదివారం అథ్లెటిక్ బిల్బావోపై జరిగిన హోరాహోరీ ఫైట్‌లో రియల్ మాడ్రిడ్.. పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్లి చేరింది. మరోవైపు సెన్సేషనల్ ప్లేయర్ లియానెల్ మెస్సీ మూడు గోల్స్ చేయడంతో శనివారం వాలెంసియాపై జరిగిన మ్యాచ్‌లో విజయంసాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్లెటికో మాడ్రిడ్, సెవిల్లాతో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానం వద్ధ స్థిరపడింది. శనివారం వాలెంసియా, బార్సిలోనా మధ్య జరిగిన మ్యాచ్ అసాంతం నాటకీయ ఫక్కీలో సాగింది. తొలుత మెస్సీ చేసిన గోల్ ను మునీర్ ఎల్ అద్దాదీ సమంచేశాడు. మూడు కీలక సమయాల్లో లియానెల్ మెస్సీ గోల్స్ చేసి జట్టును పై మెట్టుపై నిలబెట్టాడు.

లూయిస్ పెనాల్టీ బాక్స్ వద్ద కిక్ తో పంపిన బంతి నేరుగా లియానెల్ మెస్సీ చేతుల్లో పడింది. అవకాశం వచ్చిందే తడవుగా మెస్సీ దాన్ని ఏం చక్కా గోల్ పోస్ట్ కు పంపి మురిసిపోయాడు. కానీ తమ జట్టుపై అధిక గోల్స్ చేసిన మెస్సీని వాలెంసియా అభిమానులు దుర్భాషలాడటం విచారకరం.

La Liga game week 9: Roundup, results, team of the week

బుద్ధ విగ్రహంపై కుడికాలు.. రొనాల్డోపై విమర్శల వెల్లువ
స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగా' క్లబ్ జెయింట్ 'రియల్ మాడ్రిడ్' అటాకర్ క్రిస్టియానో రొనాల్డో విమర్శలు కొని తెచ్చుకున్నాడు. ఆయన తన ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోనే దీనికి కారణం. గౌతమ బుద్ధుడి తలపై కాలు పెట్టిన ఫొటో తీసి దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

క్రిష్టియానో రొనాల్డో వంటి ప్రముఖులు తమ ఫొటోగ్రాఫులు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ ఖాతాల్లో పోస్ట్ చేయడం సర్వ సాధారణ విషయం. కానీ ఆయన తన కుడికాలు బుద్ధ విగ్రహం పై మోపిన ఫొటోను పోస్ట్ చేయడమే విమర్శలను వెంటబెట్టుకుని వచ్చింది. ఇటీవల గెలుచుకున్న యూరో 2016 ఫుట్ బాల్ ట్రోఫీని కూడా తన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసినప్పుడు ప్రశంసలు వెల్లువెత్తాయి.

బుద్ధ విగ్రహం తల వద్ద నిలబడి తీసిన ఫోటో కింద 'బొం దియా' అనే వ్యాఖ్య చేశాడు. పోర్చుగీస్ లో శుభోదయం అని దీనర్థం. కానీ ఆయన అభిమానుల్లో చాలా మంది బౌద్ధమతాన్ని గౌరవిస్తారు. ఫలితంగా అభిమానులతోపాటు ఇతరులు ఆగ్రహించడంతో చిన్న పొరపాటు జరిగిందని పేర్కొంటూ ఫొటో, వ్యాఖ్యలను తన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఖాతాల నుంచి తొలగించేశాడు.

బార్సిలోనాకు మరోషాక్: మోకాలి గాయంతో ఇనెస్టా దూరం
లా లీగా జెయింట్ క్లబ్ బార్సిలోనా జట్టు మరోసారి కష్టాల్లో చిక్కుకున్నది. శనివారం వాలెంసియాపై జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా మిడ్ ఫీల్డర్ అండ్రెస్ ఇనెస్టా మోచేతికి గాయమైంది. 11వ నిమిషంలోనే మోకాలి కండరాలు పట్టేయడంతో అర్థంతరంగా మ్యాచ్ నుంచి బయటకు వెళ్లాడు. వాలెంసియా మిడ్ ఫీల్డర్ ఎంజో పెరెజ్ అడ్డుకున్నప్పుడు మోకాలి కండరాలు అకస్మాత్ గా పట్టేశాయి.

రిఫరీ వెంటనే సిగ్నలిచ్చి మరీ ఇనెస్టాను పిచ్ నుంచి తరలించాడు. దీంతో ఇనెస్టా మరో రెండు నెలల పాటు మ్యాచ్ లకు దూరంగా ఉంటాడని బార్సిలోనా క్లబ్ వైబ్ సైట్ వ్యాఖ్యానించింది. చాంపియన్స్ లీగ్ లో గ్రూప్ దశలో ఉన్న స్థితి బార్సిలోనా తన సొంతగడ్డపై క్లాసియోలో రియల్ మాడ్రిడ్ సహా 12 జట్లతో తలపడాల్సి ఉన్నది. ఈ మ్యాచ్ లన్నీ చాంపియన్ షిప్ ను ఖరారుచేసేవే.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+