బెంగళూరు: స్పానిష్ లా లీగ టోర్నీలో యధాతథంగానే రియల్ మాడ్రిడ్ ఆధిక్యం కొనసాగుతున్నది. దాని చిరకాల ప్రత్యర్థి ఎఫ్ సి బార్సిలోనాపై జరిగిన మ్యాచ్ లో స్కోర్ 1 - 1 తేడాతో డ్రా గా ముగించడంతో బార్సిలోనా కంటే రియల్ మాడ్రిడ్ ఆరు పాయింట్ల ఆధిక్యంలో మొదటి స్థానంలో నిలిచింది.
తన చిరకాల ప్రత్యర్థి బార్సిలోనాను రెండో స్థానానికి నెట్టివేసింది. శనివారం నుంచి లా లీగలో 13వ వారం మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో అతిరథుల మధ్య జరిగిన తొలి లీగ్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. కాంప్ నౌలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ సెర్జియో రామోస్ చివరి నిమిషంలో గోల్ చేయడంతో స్కోర్ సమమైంది.
దీంతో సెర్జియో రామోస్ మరోసారి రియల్ మాడ్రిడ్ జట్టుకు ఎంత అవసరమో తెలిసొచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రియల్ మాడ్రిడ్ హెడ్ కోచ్ జినెడిన్ జిడానే మీడియాతో మాట్లాడుతూ 'ఈ తరహాలో రామోస్ ఎల్లవేళలా తన ప్రతిభను కనబరుస్తాడు' అని చెప్పాడు. 'ఆయన ఏనాటికి అవకాశాలు వదులుకోరు.
అదే సెర్జియో కలిగి ఉన్న అస్త్రం' అని చెప్పాడు. రెండు జట్ల మధ్య ఫస్టాఫ్ గోల్స్ లేకుండానే ముగిసింది. సెకండాఫ్ చివరి నిమిషంలో లుకా మోడ్రిక్ పంపిన ఫ్రీ కిక్ షాట్‌ను స్పెయిన్ డిఫెండర్ రామోస్ సెర్జియో.. బార్సిలోనా గోల్ కీపర్ మార్క్ అండ్రె టెర్ స్టెగెన్ కంటే వేగంగా బంతిని గోల్ పోస్ట్ దారి మళ్లించాడు.
అంతకుముందు 53వ నిమిషంలో నేయ్మార్ పంపిన ఫ్రీ కిక్ షాట్‌ను లూయిస్ సౌరెజ్ హెడ్డర్ ద్వారా పంపడంతో బార్సిలోనా 1 - 0 స్కోర్ ఆధిక్యం సాధించింది. కానీ తర్వాత రామోస్ సెర్జియో గోల్ సాధించడంతో పరిస్థితి జిడానే సారధ్యంలోని రియల్ మాడ్రిడ్‌కు సానుకూలంగా మారింది.

తన ప్రయత్నం సఫలమైందని రామోస్ వ్యాఖ్యానించాడు. తమకు డిఫరెన్స్ కొనసాగించగల సామర్థ్యం ఉన్నదని, తామేమీ క్రేజీగా లేమని, తమ సుదీర్ఘ ప్రయాణంలో తమ ప్రతిభ పైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. 2012 నుంచి వరుసగా 33 మ్యాచ్‌ల్లో తిరుగులేని ఫలితం సాధిస్తూ తొలిసారి దేశీయ లీగ్ టైటిల్ గెలుచుకోవాలని తలపోస్తున్నది రియల్ మాడ్రిడ్.
అలాగే అట్లెటికో మాడ్రిడ్ సైతం ఎస్పాన్యోల్ పై జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించి మూడు పాయింట్ల సాధనలో వెనుక బడింది. 14వ వీక్‌లో వివిధ మ్యాచ్‌లు సాధించిన ఫలితాలివి:
గ్రనడ 2-1 సెవిల్లా
ఎఫ్ సి బార్సిలోనా 1-1 రియల్ మాడ్రిడ్
లిగానెస్ 0-0 విల్లార్రెల్
అట్లెటికో మాడ్రిడ్ 0-0 ఎస్పాన్యోల్
ఆదివారం జరిగిన మ్యాచ్ ఫలితాలు
రియల్ బెటిస్ 3 - 3 సెల్టా విగో
అట్లెటికో బిల్బావో 3-1 ఐబర్
అలావెస్ 1-1 లాస్ పాల్మాస్
స్పోర్టింగ్ 3-1 ఒసాసునా
సోమవారం జరిగిన మ్యాచ్
వాలెంసియా 2-2 మలాగ
మంగళవారం జరిగే మ్యాచ్
డెపోర్టివో వర్సెస్ రియల్ సోషిడాడ్.