Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లాలిగా 13వ వీక్: 2011 తర్వాత మళ్లీ మాడ్రిడ్

హైదరాబాద్: లాలిగా టోర్నీ 13వ వారానికి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 10 మ్యాచ్‌లకు గాను 9 మ్యాచ్‌లు జరిగాయి. క్రిస్టియానో రోనాల్డో నేతృత్వంలోని రియల్ మాడ్రిడ్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి స్పోర్టింగ్ జిగాన్‌పై 2-1తో విజయం సాధించింది. 7 పాయింట్లతో రియల్ మాడ్రిడ్ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది.

2011లో రియల్ మాడ్రిడ్ తొలి టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత మాడ్రిడ్ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఇక టోర్నీలో భాగంగా ఆదివారం ఓసాసునాపై అథ్లెటికో మాడ్రిడ్ జట్టు 3-0తో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఎఫ్‌సి బార్సిలోనా, రియల్ సోషియోడాడ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.

ఈ గేమ్‌లో రియల్ సోషియోడాడ్ ఆటగాళ్లు సత్తా చాటారు. దీంతో గేమ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఆటలో భాగంగా రెండో అర్ధభాగంలో రియల్ సోషియోడాడ్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించినా లియోనిల్ మెస్సీ గోల్ చేయడంతో మ్యాచ్ సమమైంది. తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకోవడంలో ఎఫ్‌సి బార్సిలోనా జట్టు విఫలమైంది.

La Liga game week 13: Roundup and results


లాలిగా టోర్నీలో 13వ వీక్ ఫలితాలు:

శనివారం, నవంబర్ 26
ఐబర్ 3-1 రియల్ బీటీస్
మాలాగా 4-3 డిపోర్టివో
రియల్ మాడ్రిడ్ 2-1 స్పోర్టింగ్
ఎప్సినాయోల్ 3-1 లిగానిస్

ఆదివారం, నవంబర్ 27
సివిల్లా 2-1 వలనికా
విల్లారియల్ 0-2 అల్వాస్
ఓసాసునా 0-3 అథ్లెటికో మాడ్రిడ్
సెల్టా విగో 3-1 గ్రనాడా

సోమవారం, నవంబర్ 28
రియల్ సోషియోడాడ్ 1-1 ఎఫ్‌సి బార్సిలోనా

మంగళవారం, నవంబర్ 29
లాస్ పల్మాస్ Vs అథ్లెటిక్ బిల్బావో

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+