Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లా లిగా క్లబ్‌లోని 15 మందికి కరోనా!!

La Liga club Alaves report 15 positive tests for coronavirus

మాడ్రిడ్: ప్రతిష్ఠాత్మక లా లిగా క్లబ్‌కు చెందిన స్పానిష్‌ ఫుట్‌బాల్‌ జట్టు అలవేస్‌లోని 15 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని లా లిగా క్లబ్‌ బుధవారంఓ ప్రకటనలో తెలిపింది. అలవేస్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు, లా లిగా క్లబ్‌ కోచింగ్‌ బృందంలోని ఏడుగురికి పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్‌ అని తేలింది. వీరితో పాటు మరో ఐదుగురు ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందట.

వైరస్ సోకిన 15 మందికి ప్రత్యేకంగా చికిత్స చేయిస్తున్నట్టు క్లబ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 'మా కుటుంబంలో భాగమైన 15 మందికి మెరుగైన వైద్యం అందించాలని క్లబ్ నిర్ణయం తీసుకుంది. కరోనా ఫలితాలలో అత్యవసర కేసులుగా గుర్తించబడిన కారణంగా నివారణ చర్యలను వెంటనే అమలు చేసాం. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇన్ఫెక్షన్ సోకకుండా చోసుకోవాలి. దీనికి నివారణ చర్యలను అమలు చేయడం ఉత్తమ మార్గం' అని ఓ క్లబ్‌ అధికారి పేర్కొన్నారు. అయితే 15 మంది ఆరోగ్యంగానే ఉన్నారట.

మార్చి 6న సొంతగడ్డపై అలవేస్‌ జట్టు లెన్సియా జట్టుతో తలపడింది. అప్పటి నుండి క్లబ్‌లోని 35 శాతం మంది ఆటగాళ్లకు కరోనా వైరస్‌ పాజిటివ్ అని తేలింది. ఐరోపాలో ఇటలీ తరువాత స్పెయిన్‌లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం వెలుబడిన గణాంకాల ప్రకారం స్పెయిన్‌లోదాదాపు 14,000 కేసులు నమోదు కాగా.. 600 మందికి పైగా మరణించారు.

కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా యువ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. స్పానిష్‌ లీగ్‌ సెకండ్‌ డివిజన్‌ టీమ్‌ అట్లెటికో పోర్టాడా అల్టా టీమ్‌కు 21 ఏళ్ల ఫ్రాన్సిస్కో గార్షియా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడు లుకేమియాతో బాధపడుతున్నట్టు సమాచారం. కరోనా వ్యాధి లక్షణాలు కనిపించగానే గార్షియాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మరణించాడని అట్లెటికో పోర్టాడా తెలిపింది.

Story first published: Thursday, March 19, 2020, 8:30 [IST]
Other articles published on Mar 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+