Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లా లిగా టోర్నీ: 26వ వారంలో జరిగే మ్యాచ్ వివరాలు

హైదరాబాద్: లాలిగా టోర్నీ 26వ వారానికి చేరుకుంది. ఈ వారం తొలి మ్యాచ్‌లో భాగంగా రియల్ బేతిస్ జట్టు రియల్ సోసియాడాడ్ జట్టుతో తలపడనుంది. ఈ సీజన్ రియల్ సోసియాడాడ్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

ఇక పాయింట్ల పట్టికలో సోసియాడాడ్ 45 పాయింట్లతో అథ్లెటికో మాడ్రిడ్ జట్టుతో సంయుక్తంగా నాలుగో స్ధానంలో ఉంది. రియిల్ బేతిస్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో మరో స్ధానానికి ఎగబాకే అవకాశం ఉంటుంది.

అథ్లెటికో మాడ్రిడ్, వాలెన్సియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఈ వారానికే హైలెట్‌గా నిలవనుంది. దీంతో పాటు ఎఫ్‌సి బార్సిలోనా, సెల్టా వైగోతో తలపడనుంది. గత మూడు నెలలుగా తన విజయం పరంపరను కొనసాగిస్తున్న బార్సిలోనా అదే జోరుని కొనసాగించాలనే యోచనలో ఉంది.

La Liga 2016/17: Schedule for game week 26

ఇక, లీగ్‌లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న రియల్ మాడ్రిడ్, ఐబర్‌తో తలపడనుంది. రియల్ మాడ్రిడ్ జట్టు ఈ మధ్యకాలంలో ఆశించిన మేరకు సత్తా చాటడం లేదు. లాస్ పాల్మస్‌తో జరిగిన మ్యాచ్‌ను 3-3తో డ్రా చేసుకుంది.

లాలిగా 26వ వారంలో జరిగే మ్యాచ్‌లివే:

శనివారం, మార్చి 4
రియల్ బేతిస్ Vs రియల్ సోసియాడాడ్ - 1:15 AM (IST)
లాగాన్స్ Vs గ్రనడ - 5:30 PM (IST)
ఐబర్ Vs రియల్ మాడ్రిడ్ - 8:45 PM (IST)
విల్లారియల్ Vs ఇస్పానాయల్ - 11: 00 PM (IST)

ఆదివారం, మార్చి 5
ఎఫ్‌సి బార్సిలోనా Vs సెల్టా వైగో - 1:15 AM (IST)
స్పోర్టింగ్ Vs డిపోర్టివ్ - 4:30 PM (IST)
అథ్లెటికో మాడ్రిడ్ Vs వాలాన్సియా - 8:45 PM (IST)
లాస్ పాల్మస్ Vs ఓసాసునా - 11:00 PM (IST)

సోమవారం, మార్చి 6
అథ్లెటిక్ ఐల్బా Vs మలగ - 1:15 AM (IST)

మంగళవారం, మార్చి 7
అవావెస్ Vs సెవిల్లా - 1:15 AM (IST)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+