
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020 భాగంగా ఈరోజు రాత్రి చెన్నయిన్ ఎఫ్‌సీతో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ తలపడనుంది. ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు వాస్కోలోని తిలక్ మైదాన్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఐఎస్‌ఎల్ టోర్నీలో రెండు జట్లు ఆరుసార్లు తలపడగా.. చెన్నయిన్ ఆధిక్యంలో ఉంది. చెన్నయిన్ రెండు మ్యాచుల్లో విజయాలు అందుకోగా.. మిగతా నాలుగు మ్యాచులు డ్రా అయ్యాయి. దీంతో ఈ రోజు కూడా చెన్నయిన్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. చివరి ఐదు మ్యాచుల్లో కూడా చెన్నయిన్ ఎఫ్‌సీదే పైచేయి.
2017లో లీగ్‌లో ఆరంగేట్రం చేసిన జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఇప్పటివరకు ప్లేఆఫ్ చేరలేదు. దీంతో ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బరిలోకి దిగుతోంది. మరోవైపు చెన్నైయిన్ ఎఫ్‌సీ ఫైనల్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సీజన్లో కోచ్ ఓవెన్ కోయిల్ లేకపోవడం చెన్నైయిన్ ఎఫ్‌సీకి కాస్త ప్రతికూలాంశం. కొత్త కోచ్ సిసాబా లాస్లో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టును ముందుండి నడిపించే అవకాశం ఉంది.
జట్లు:
జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ: టిపి రహేనేష్, లాల్డిన్లియానా రెంత్లీ, నరేందర్ గెహ్లోట్, పీటర్ హార్ట్లీ, సందీప్ మండి, ఐటర్ మన్రాయ్, అమర్జిత్ కియామ్, జాకిచంద్ సింగ్, అలెక్స్ లిమా, నికోలస్ ఫిట్జ్‌గెరాల్డ్, నెరిజస్ వాల్స్కిస్.
చెన్నైయిన్ ఎఫ్‌సీ: విశాల్ కైత్, రీగన్ సింగ్, ఎలి సాబియా, ఎనెస్ సిపోవిక్, జెర్రీ లాల్రిన్జులా, ఎడ్విన్ సిడ్నీ వాన్స్‌పాల్, అనిరుధ్ థాపా; ఫత్ఖులో ఫత్ఖులోవ్, రాఫెల్ క్రివెల్లారో, లల్లియన్జులా చాంగ్టే, ఎస్మాయిల్ గోన్కల్వ్స్.
last five fixtures:
1. Chennaiyin FC vs Jamshedpur FC - January 23, 2020 - Chennaiyin won 4-1
2. Jamshedpur FC vs Chennaiyin FC - December 9, 2019 - Match Drawn 1-1
3. Chennaiyin FC vs Jamshedpur FC - February 23, 2019 - Match Drawn 0-0
4. Jamshedpur FC vs Chennaiyin FC - November 25, 2018 - Jamshedpur won 3-1
5. Chennaiyin FC vs Jamshedpur FC - February 18, 2018 - Match Drawn 1-1