న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: బాప్ రే ఎంబాపే.. మ్యాచ్ మొత్తం తిప్పేశాడుగా..!

Mbappe scores two consecutive goals. Turns the final into a thriller.

ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌ ఉత్కంఠ భరితంగా మారింది. ఆరంభంలో సత్తా చాటిన అర్జెంటీనా తొలి హాఫ్‌లోనే రెండు గోల్స్ చేసి పైచేయి సాధించింది. ఈ సమయంలో కొంత తడబడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆట మొత్తం ఏకపక్షంగా, బోరింగ్‌గా సాగుతోందని అభిమానులు అనుకున్నారు. కానీ ఫ్రాన్స్ చివర్లో పుంజుకుంది. 80వ నిమిషంలో ఫ్రాన్స్‌కు ఒక పెనాల్టీ దక్కింది. పెనాల్టీ బాక్సులో కోలో మనీని కింద పడేయడంతో ఫ్రాన్స్‌కు ఈ అవకాశం దక్కింది. దీన్ని తీసుకున్న ఎంబాపే ఫ్రాన్స్ తరఫున ఈ మ్యాచ్‌లో తొలి గోల్ చేశాడు. ఆ మరు నిమిషంలోనే మరో గోల్ చేసిన అతను స్కోర్లు సమం చేశాడు.

మెస్సీ అదిరే ఆరంభం..
మ్యాచ్ ప్రారంభమైన 23వ నిమిషంలోనే అర్జెంటీనాకు ఇక పెనాల్టీ కిక్ దక్కింది. ఫ్రాన్స్ ఆటగాళ్లు ఫౌల్ చేసినట్లు నిర్ణయించిన రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని గోల్ చేసే బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్న అర్జెంటీనా సారధి లియోనెల్ మెస్సీ.. మరోసారి తనను అందరూ ఫుట్‌బాల్ జీనియస్ అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడు. పెనాల్టీ స్పాట్‌ నుంచి చూడచక్కని షాట్‌తో గోల్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఏంజెల్ డి మరియా కూడా తనకు దక్కిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 36వ నిమిషంలో అద్భుతమైన గోల్‌తో తమ జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.

పుంజుకున్న ఫ్రాన్స్..
ఆరంభం నుంచి మైదానంలో నెమ్మదిగా కదిలిన ఫ్రాన్స్ ఆటగాళ్లలో ఎంబాపే హుషారు నింపాడు. ఆట 80వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఓటమెండీ కారణంగా ఫ్రాన్స్ ఆటగాడు మౌనీ కింద పడ్డాడు. ఈ ఘటన పెనాల్టీ ఏరియాలో జరిగింది. దీంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ లభించింది. దీన్ని గోల్ చేసే బాధ్యతను తను తీసుకున్న కిలియన్ ఎంబాపే.. అద్భుతమైన షాట్‌తో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమీలియానో మార్టినెజ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ గోల్ చేసిన నిమిషం వ్యవధిలోనే ఎంబాపే మరో గోల్ సాధించాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత పైచేయి సాధించడం కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆట ఎక్స్‌ట్రా టైంకి వెళ్లింది.

Story first published: Sunday, December 18, 2022, 23:00 [IST]
Other articles published on Dec 18, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X