Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంబపే గోల్‌కి.. ట్విట్టర్ టాప్ లేచిపోయిందట..!!

Kylian Mbappe’s final goal was the most tweeted moment of the World Cup

హైదరాబాద్: రష్యా వేదికగా ముగిసిన ఫిఫా ప్రపంచ కప్‌ 2018 నెల రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో అయితే.. ఆటగాళ్లు తమ సత్తా చాటుతూ.. అద్బుతమైన ప్రదర్శన చేశారు. వీరి గోల్స్‌ కొడితే ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ కూడా కోడై కూసింది. ఈ ప్రపంచకప్‌ సందర్భంగా క్రీడాభిమానులంతా ప్రముఖ సోషల్ మీడియా.. ట్విటర్‌ ద్వారా సంభాషణలు జరిపారు.

32 జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన 64 మ్యాచ్‌ల్లో

ఈ విషయాలను తాజాగా ట్విటర్‌ నిర్వాహకులు వెల్లడించారు. 32 జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన 64 మ్యాచ్‌ల్లో ఎక్కువ మంది ఈ మ్యాచ్‌ గురించే చర్చించుకున్నారంటూ.. ఫ్రాన్స్‌-క్రొయేషియా మధ్య ఫైనల్‌ మ్యాచ్ పేరు చెప్పుకొచ్చారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో భాగంగా బ్రెజిల్‌-బెల్జియం, జులై 2న బ్రెజిల్‌ -మెక్సికో మధ్య జరిగిన మ్యాచ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

జూన్‌ 14న ప్రారంభమై జులై 15న ముగిసిన

జూన్‌ 14న ప్రారంభమై జులై 15న ముగిసిన

మొత్తంగా జూన్‌ 14న ప్రారంభమై జులై 15న ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌ గురించి ట్విటర్లో 115 బిలియన్ల సంభాషణలు జరిగాయట. అంతేకాదు టోర్నమెంట్‌కు సంబంధించి 7.1 మిలియన్ల వీడియోలను అభిమానులు పంచుకున్నారట. మ్యాచ్‌లు జరిగే సమయంలోనే ఎక్కువ మంది తమ అభిప్రాయాలు వెల్లడించారని ట్విట్టర్‌ నిర్వాహకులు తెలిపారు.

ఒక ఆటగాడు కొట్టిన గోల్‌కి ట్విట్టర్‌ మారుమోగి

ఒక ఆటగాడు కొట్టిన గోల్‌కి ట్విట్టర్‌ మారుమోగి

ఫ్రాన్స్‌-క్రొయేషియా మధ్య జరిగిన ఫైనల్లో ఒక ఆటగాడు కొట్టిన గోల్‌కి ట్విట్టర్‌ మారుమోగింది. ఇంతకీ ఆ గోల్‌ ఎవరిదంటే ఫ్రాన్స్‌ యువ సంచలన ఆటగాడు కిలాన్ ఎంబపె. ఫైనల్లో 65వ నిమిషంలో ఎంబపె గోల్‌ చేసి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. యావత్తు ప్రపంచకప్‌లో ఎంబపె కొట్టిన ఈ గోల్‌ గురించే ఎక్కువ మంది ట్విటర్‌లో మాట్లాడుకున్నారట. రికార్డు స్థాయిలో ట్వీట్లు వెల్లువెత్తాయట.

అర్జెంటీనాపై అద్భుత ప్రదర్శన చేసి

అర్జెంటీనాపై అద్భుత ప్రదర్శన చేసి

ఈ మెగా టోర్నీలో లీగ్‌ దశలో అంతగా మెరవని ఎంబపె ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్‌ చేసి ఔరా అనిపించాడు. కేవలం ఆటతీరుతోనే కాకుండా తన ఔన్నత్యాన్ని విరాళ రూపంలోనూ బయటపెట్టాడు ఎంబపే. తాజాగా ఫిఫా ప్రపంచకప్‌ ద్వారా అందుకునే మొత్తాన్ని ఛారిటీకి అందజేస్తున్నట్లు ప్రకటించిన ఈ ప్రపంచకప్‌ హీరో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.

Story first published: Thursday, July 19, 2018, 12:07 [IST]
Other articles published on Jul 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+