స్ట్రాస్‌బర్గ్‌తో జరిగిన మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జర్మైన్ (పీఎస్‌జీ) 2-1తో విజయం సాధించింది. ఈ గెలుపుతో తొమ్మిది పాయింట్లు సాధించి పీఎస్‌జీ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే స్ట్రాస్‌బర్గ్ స్వీయ తప్పిదాలతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
మ్యాచ్ ప్రారంభమైన 35 సెకన్లలోనే గోల్ చేసే సువర్ణావకాశం ఆ జట్టుకు లభించింది. కానీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. కాపేపటికే మరో అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయింది. మరోవైపు ఆరో నిమిషంలో పారిస్ సెయింట్ జర్మైన్‌కు పెనాల్టీ షూట్ దక్కింది. కానీ ఎంబాపే చేసిన గోల్‌ను స్ట్రాస్‌బోర్గ్ గోల్‌కీపర్ బెల్లారౌచ్ అద్భుతంగా డైవ్ చేస్తూ అడ్డుకున్నాడు.

అయితే 31వ నిమిషంలో బెల్లారౌచ్ ప్రత్యర్థి జట్టు గిఫ్ట్ ఇచ్చాడు. తన వద్దే కాసేపు బంతి ఉంచుకోవడం తమ జట్టు కొంపముంచింది. స్ట్రాస్‌బోర్గ్ దగ్గర నుంచి బాల్‌ను అసెన్సియా దక్కించుకుని ఎబాపేకు పాస్ చేశాడు. దాన్ని ఎబాపే ఎలాంటి పొరపాటు లేకుండా ఈజీగా గోల్ చేశాడు.
సెకండ్ హాఫ్ ఆదిలోనే పారిస్ సెయింట్ జర్మైన్ మరో గోల్ కొట్టి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత పోరాడిన స్ట్రాస్‌బర్గ్ మొత్తానికి గోల్ కొట్టి ఖాతా తెరిచింది. అయితే స్కోరును సమం చేసే అవకాశాన్ని స్ట్రాస్‌బర్గ్ చేజార్చుకుంది. పీఎస్‌జీ గోల్ కీపర్ డోనరుమ చేతుల్లోకే రెండు సార్లు గోల్ కొట్టి మంచి ఛాన్స్‌ను మిస్ చేసుకున్నారు.మొదట జూనియర్ మ్వాంగా,తర్వాత ఇమాన్యుయెల్ గోల్‌కు ట్రై చేసి ఫెయిలయ్యారు.