ఐఎస్ఎల్: నాటకీయ విజయంతో టాప్‌లోకి కేరళ
కోచి: నాటకీయ ఫక్కీలో కేరళ బ్లాక్ బస్టర్స్ విజయం సాధించింది. సొంత గడ్డ కోచిలో మంగళవారం ఎఫ్ సి గోవా జట్టుపై జరిగిన మ్యాచ్ లో కేరళ జట్టు అనూహ్యంగా 2-1 స్కోర్ చేసి గెలుపొందడంతో టాప్ ఫోర్ జట్ల సరసన చేరింది. సెకండాఫ్ ముగిసే సమయానికి రెండో గోల్ చేయడంతో మ్యాచ్ కేరళ సొంతమైంది.
ప్రారంభ దశలో గోవా కుర్రాళ్లు చెలరేగిపోయారు. 34 వేల మంది సొంత అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభంలో తొమ్మిదో నిమిషంలో గోవా ప్లేయర్ రాఫెల్ కొయెల్హో గోల్ చేయడంతో జికో టీం ఆధిక్యం సాధించింది. తర్వాత 48వ నిమిషంలో కెర్విన్ బెల్ఫోర్ట్ గోల్‌తో స్కోర్ సమం చేయగా, సికె వినీత్ చివరి క్షణంలో 99వ నిమిషంలో చేసిన గోల్ కేరళను గెలుపు తీరాలను దాటించింది.
దీనికి తోడు రిచర్ల్యేసన్‌కు రెండోసారి రిఫరీ ఎల్లో కార్డు చూపడంతో గోవా నుంచి తొమ్మిది మంది ప్లేయర్లే ఉండటం కూడా కేరళకు లబ్ధి చేకూర్చింది. బంతిపై నియంత్రణ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలుచేసిన కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లు.. గోవా ప్లేయర్ కొయెల్హె తొమ్మిదో నిమిషంలో గోల్ కొట్టేవరకు ఆసక్తిగా మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.
అప్పటి నుంచి దూకుడుగా ఆదుడూ దూసుకెళ్లారు. తొలుత కేరళ ఆటగాడు జోసు కుర్రాయిస్ నేరుగా గోవా కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణిని అడ్డుకునే ప్రయత్నంలో కార్నర్ నుంచి కొట్టిన కిక్ నేరుగా నెట్ పక్కనుంచి వెళ్లిపోయింది. కొయెల్హే గోల్ తర్వాత స్కోర్ సమంచేసేందుకు కేరళ ప్లేయర్లు మహ్మద్ రఫీ, మహ్మద్ రఫీఖ్‌లకు పలు చాన్స్‌లు చిక్కినా వైడ్‌గా మారిపోయాయి.
మిఖైల్ చోప్రా బాక్స్ లో ఉన్న సంగతి గుర్తించిన మహ్మద్ రఫీఖ్ నేరుగా కట్టిమణి వైపు బంతిని కిక్ కొట్టేందుకు వచ్చిన సువర్ణావకాశాన్ని మిస్ చేసుకున్నాడు. కేరళ కుర్రాళ్లు అనునిత్యం బాల్ ను పాస్ చేస్తుండటంతో మ్యాచ్ వాతావరణం వేడెక్కింది. ఆర్నోలిన్, లుసియానో సుబ్రోసాలకు గోల్స్ చేసేందుకు వచ్చిన అవకాశాలను కేరళ ఒత్తిడితో తిరగ్గొట్టింది.

ప్రథమార్దంలో దూకుడుని ప్రదర్శించిన కేరళ
జోసు లెప్ట్ నుంచి ప్రమాదకరమైన బంతులను షాట్స్ రూపంలో దూరం నుంచి పంపినా వైడ్‌గా మారిపోయాయి. తొలి హాఫ్ వరకు కేరళ శక్తిమంతమైందిగా కనిపించినా గోవా ముందే గోల్ చేయడం ఆధిపత్యం సాధించగలిగింది.
సెకండాఫ్ లో బ్యాంగ్ మొదలైంది. మహ్మద్ రఫీఖ్ షాట్ ను ఆర్నోలిన్ విజయవంతంగా అడ్డుకున్నాడు. కాని 48వ నిమిషంలో బెల్ఫోర్ట్ కొట్టిన కిక్ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి చేరిపోవడంతో స్కోర్ సమమైంది. అప్పటి నుంచి విన్నింగ్ షాట్ కోసం గోవా కూడా పోరాడింది. జోషు పంపిన ఫ్రీ కిక్ ను కట్టిమణి కట్టడిచేసేశాడు.

మ్యాచ్ మలుపు తిప్పిన రిచర్ల్యైసన్ ఫౌల్
ఈ దశలో మరోసారి వినీత్ ను అడ్డుకునే దశలో రిచర్ల్యైసన్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఆయనకు రెండోసారి ఎల్లోకార్డు చూపాడు. తత్ఫలితంగా గోవా జట్టు తొమ్మిది మందితోనే కొనసాగాల్సి వచ్చింది. దీనికి తోడు తొమ్మిది నిమిషాలు ‘ఇన్‌జ్యూరీ'టైం కేరళ బ్లాక్ బస్టర్స్‌కు కలిసి వచ్చింది. గోవా నిరంతరం తెరిపి లేని డిఫెన్స్ ఆటకు ప్రాధాన్యం ఇచ్చినా ఇన్ జ్యూరీ సమయంలో చివరి నిమిషం కేరళకు కలిసొచ్చింది. వినీత్ తెలివిగా బంతిని గోల్ పోస్ట్‌కు పంపినా కీపర్ అడ్డుకోలేకపోయాడు. కేరళ ఖాతాలో రెండో గోల్ చేయడంతో గోవాపై 2 - 1 స్కోర్ ఆధిక్యం సాధించి టాప్ 4 జట్లలో చేరిపోయింది.

పాయింట్ల పట్టికలో అట్టడుగున గోవా
యథాప్రకారం గోవా పాయింట్ల టేబుల్ దిగువనే స్థిరపడిపోయింది. గోవా కుర్రాళ్లు తరుచుగా తమ ఆవేశాన్ని నిలుపుకోలేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. సెకండాఫ్ లో గోల్ కోసం ప్రయత్నించిన రోమియో ఫెర్నాండెజ్ గాయపడ్డాడు. ఇక గ్రెగరీ ఆర్నోలిన్, రిచర్ల్యైసన్ లకు రిఫరీ ఎల్లో కార్డు చూపడం గోవాకు ప్రతికూలాంశాలుగా చెప్పుకోవచ్చు. రిఫరీ నిర్ణయంపై గోవా కోచ్ జికో తీవ్ర అసంత్రుప్తి వ్యక్తంచేశాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత గోవా ప్లేయర్లు రిఫరీని చుట్టుముట్టి తమ నిరసన తెలియజేశారు. కేరళ కుర్రాళ్లు పూర్తిగా డిఫెన్స్ మంత్రం పాటిస్తే.. గోవా ప్లేయర్లు అనునిత్యం బంతిని వదులుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

వ్యూహాత్మక ఆటతీరుని కనబర్చిన కేరళ
తొలి నుంచి అవకాశాలను కల్పించుకుని గోల్స్ చేయడం సమస్యగా ఉన్న కేరళ కుర్రాళ్లు మంగళవారం సరైన దిశలో స్పందించారు. 4-1-4-1 వ్యూహంతో బరిలోకి దిగిన కేరళ బ్లాక్ బస్టర్స్ మిడ్ ఫీల్డ్ ను యుద్ధక్షేత్రంగా మలిచారు. అవకాశాలు నెలకొల్పారు. మరోవైపు గోవా సమస్యలు కొని తెచ్చుకున్నది. కేరళ కుర్రాళ్లలో ఎడమవైపున కెర్విన్ బెల్ఫోర్ట్, కుడివైపున మహ్మద్ రఫీఖ్.. ముందు భాగంలో మిఖైల్ చోప్రా, మహ్మద్ రఫీ పూర్తి అవగాహనతో సమిష్టి వ్యూహంతో మొదటిసారి బంతి పాస్ చేస్తూ వ్యూహాత్మక ఆటతీరు కనబరిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications