Lionel Messi : 30 అడుగుల మెస్సి కటౌట్.. ఈ ఫుట్‌బాల్ పిచ్చి మన దేశంలోనే!

భారత దేశంలో క్రికెట్ తర్వాత అంతగా అభిమానులను సంపాదించుకున్న క్రీడ ఫుట్‌బాల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక్కడ ఓనమ్ తర్వాత అంతగా సెలబ్రేట్ చేసుకునే వేడుక ఫిఫా వరల్డ్ కప్ అన్నా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు. అంత ఫుట్‌బాల్ పిచ్చి ఉన్న ఇక్కడి ప్రజలు మరికొన్ని రోజుల్లో ఫిఫా ప్రపంచకప్ మొదలవుతోందని తెలిస్తే కుదురుగా కూర్చుంటారా? అందుకే తమ అభిమాన ఫుట్‌బాల్ స్టార్‌కు తమ మద్దతు తెలుపుతూ 30 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
.
భారత్‌లో క్రికెట్ హవా నడుస్తుండటంతో ఫుట్‌బాల్ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ మిగతా దేశాల్లో ఫుట్‌బాల్ ప్రేమికుల సంఖ్య తక్కువేం కాదు. మరి భారత్‌లో ఫుట్‌బాల్‌కు క్రేజ్ లేదు కదా అని కేరళ ప్రజలు తమ క్రేజ్ ఎందుకు మార్చుకుంటారు? అందుకే లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మార్ జూనియర్ వంటి ఆటగాళ్లపై అభిమానం పెంచుకున్నారు. వాళ్లేదో కేరళలోనే పుట్టి పెరిగినట్లుగా ఆరాధిస్తారు ఇక్కడి ఫుట్‌బాల్ ప్రియులు. అంతేకాదు, నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఫిఫా ప్రపంచకప్ అన్నా పడి చస్తారు. అలాంటి క్రీడా వేడుక మరో వారం రోజుల్లోనే మొదలవుతుంటే సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి.
కేరళలో చాలా మంది అర్జెంటీనా, బ్రెజిల్ జట్లకే అభిమానులు. అందుకే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి కటౌట్ ఏర్పాటు చేశారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తే మజా ఏముంటుంది? అనుకున్నారేమో. ఏకంగా కోజికోడ్‌లోని కురుంగట్టు కడావు నది మధ్యలో 30 అడుగుల మెస్సి కటౌట్ సెట్ చేశారు. మెస్సిని అర్జెంటీనా అభిమానులు ప్రేమగా 'మెసాయా' (Messiah) అని పిలుస్తారు. తన అభిమానం గురించి చెప్పుకున్న అహ్మద్ అనే స్థానికుడు.. 'ఈ ఏడాది ఎలాగైనా మా మెస్సిహా (మెసాయా) ప్రపంచకప్ ముద్దాడుతాడు. ఆయనమై మాకు ఆ నమ్మకం ఉంది' అన్నాడు. పుల్లవూర్ అనే అర్జెంటీనా ఫ్యాన్స్ క్లబ్ ఈ కటౌట్ ఏర్పాటు చేసింది. ఈ సభ్యులంతా ఈ కటౌట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అర్జెంటీనా, బ్రెజిల్‌లోని మీడియా సంస్థలు కూడా దీన్ని కవర్ చేయడం మొదలు పెట్టాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications