Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాటరాజ్జీకి వినూత్న వెల్‌కంకు కేరళ ఫ్యాన్స్ రెడీ

కోచి: కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్‌సి జట్టుతో జరిగే మ్యాచ్ కోసం కోచికి వచ్చిన డిఫెండింగ్ చాంపియన్ హెడ్ కోచ్ మార్కో మాటరాజ్జీకి కేరళ ఫ్యాన్స్ వినూత్న రీతిలో స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేశారు. జినెడిన్ జిడానే మాస్కులు ధరించి మరీ మాటరాజ్జీకి స్వాగతం పలికి తమ అభిమానం చాటుకునేందుకు సిద్ధమయ్యారు. తొలి ఎడిషన్‌లో సెమీ ఫైనల్స్ దశకు దూసుకెళ్లిన చెన్నైయిన్ ఎఫ్‌సి, కేరళ బ్లాక్‌బస్టర్స్ ప్లేయర్ల మధ్య ఆప్యాయత కానరాలేదు.

ఈ ఏడాది రెండు జట్లు తలపడినప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మ్యాచ్ అధికారుల కంటే ఇతరులతో దుష్ప్రవర్తనతో వ్యవహరించినందుకు చెన్నైయిన్ కోచ్ మాటరాజ్జీ సస్పెన్షన్‌కు దారితీసింది. ఈ పరిస్థితుల్లో శనివారం ఇటాలియన్ వరల్డ్ కప్ విన్నర్ ఈ దఫా 35 వేల మంది అభిమానుల మధ్యకు వచ్చినప్పుడు అత్యంత అభిమానంతో కూడిన ఆహ్వానం పలుకనున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే అభిమానులంతా జినెడిన్ జిడాన్ మాస్కులు ధరించి స్వాగతం పలుకుతారు.

ఈ మాస్క్ పిక్చర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మలయాళంలో రాసిన ఓ పోస్టులో 'ఒకవేళ మీరు కొనాలని భావిస్తే నేను ఈ మాస్కులతో సిద్ధంగా ఉంటాను' అని పేర్కొన్నాడు. వివాదాలకు అతీతుడైన మాటరాజ్జీ.. కేరళ అభిమానుల తీరుపట్ల మరోలా స్పందించాడు. 'మీరు ఇదంతా ఎందుకు ఖర్చుచేస్తున్నారు. ఈ సొమ్మంతా ఆహారం కోసం ఖర్చు పెట్టడానికి బదులు ఈ మాస్కులకు ఎందుకు ఖర్చుచేస్తున్నారు' అని తెలిపాడు. కాగా గతేడాది డిఫెండింగ్ చాంపియన్ గా చెన్నైయిన్ ఈ దఫా 10 పాయింట్లతో గోవాకు ఒక స్థానం ముందు నిలిచింది.

Kerala fans to greet Materazzi with Zidane masks

అస్థిరతకు చోటే లేదన్న బెలెంసోకో

కోల్‌కతా: ప్రస్తుత ఎడిషన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఓటమెరుగని మాజీ చాంపియన్ అట్లెటికో డీ కోల్‌కతా తర్వాత గత మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓటమి పాలైనా సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లలేదని, పరిస్థితి అస్థిరంగా ఉందన్న వాదనను స్పానిష్ ఫార్వర్డ్ జువాన్ బెలెంసోకో కొట్టి పారేశాడు. 'మీరు ప్రతి మ్యాచ్ గెలుపొందలేరు. కొన్నిసార్లు మీరు ఓటమి పాలవుతారు. మరికొన్ని సార్లు గెలుపొందుతారు. కానీ ప్రతి టీంకు కూడా ప్రతి మ్యాచ్ చాలా కీలకం. మేం పుణె జట్టుతో చాలా బాగా ఆడాం. అన్నింటికంటే ముఖ్యమైనదేమిటంటే మేం టాప్ ఫోర్ లో ఉన్నాం. టీంలన్నీ గెలువడానికి పోరాడతాయి' అని తెలిపారు.

ఆదివారం నాడు ఢిల్లీ డైనమోస్ జట్టుతో కోల్ కతా తలపడనున్నది. తొలి ఎడిషన్ చాంపియన్లుగా కోల్ కతా జట్టు తోలిసారి ఢిల్లీ డైనమోస్ పై 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత 8 ఫ్రాంచైసీల టోర్నీలో ఢిల్లీ డైనమోస్ చాలా మంచి టీం అని బెలెంసోకో అభివర్ణించాడు. చాలా వేగంగా దూసుకెళ్లే ప్లేయర్లు ఉన్నారని, మంచి టెక్నిక్‌లతో ఆడే కుర్రాళ్లు ఉన్నారన్నాడు.

కానీ ఎక్కడైనా గెలుపొందే విశ్వాసం తమ జట్టులో ఉన్నదని తెలిపాడు. తమ జట్టులో ఫార్వర్డ్ ద్వయం హెల్డర్ పొస్టిగ, ఇయాన్ హుం చాలా ప్రొఫెషనల్ ప్లేయర్స్, టీం కోరుకుంటే తన వంతు సేవలందించేందుకు సిద్ధమన్నాడు. తాము మంచిగా ఆడుతున్నా కొన్నిసార్లు చేస్తున్న పొరపాట్లు పాయింట్లు కోల్పోవడానికి దారి తీస్తున్నదన్నారు.

పీఎస్జీని వీడనన్న వెర్రాట్టి

పారిస్: తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పారిస్ సెయింట్ జెర్మైన్ (పీఎస్జీ) జట్టును వీడబోనని మిడ్ ఫీల్డర్ మార్కో వెర్రాట్టి స్పష్టం చేశాడు. స్పానిష్ లీగ్ 'లా లీగా' జెయింట్ రియల్ మాడ్రిడ్ తో గానీ, మరే ఇతర క్లబ్ జట్టుతో గానీ కాంట్రాక్టుపై సంతకం చేయాలని తాను తలపోయడం లేదన్నాడు. తాను ఫ్రెంచ్ ఫుట్ బాల్ క్లబ్ కుటుంబంలో భాగస్వామిని కావాలని తలపోస్తున్నట్లు తెలిపాడు.

పలు క్లబ్‌లు తనతో కాంట్రాక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటం తనకు గర్వ కారణమని చెప్పాడు. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ నగరాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఐదేళ్ల క్రితం పీఎస్జీలో సభ్యుడిగా చేరిన వెర్రాట్టి.. ఇతర జట్టు సభ్యులతో కలిసి జట్టు విజయానికి క్రుషి చేయడమే తన ముందు ఉన్న లక్ష్యమన్నాడు. అతడితో 109 మిలియన్ డాలర్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు పలు క్లబ్ లు ఆసక్తిగా ఉన్నా.. వెర్రాట్టి మాత్రం అందుకు నిరాకరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఏ క్రీడాకారుడితో ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టు చేసుకునేందుకు సిద్ధ పడలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+