For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోవాపై కేరళ థ్రిల్లింగ్ విన్: కొప్పెల్ ఫుల్ హ్యాపీ

By Nageshwara Rao

మార్గోవా: ఎఫ్ సి గోవా క్లబ్ జట్టుపై సొంత గడ్డ మార్గోవాలో జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్ థ్రిల్లింగ్ విజయం నమోదుచేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో గోవాతోపాటు వెనుకబడి ఉన్న కేరళ 8 పాయింట్లతో ఐదో స్థానానికి దూసుకెళితే.. జికో సేన మాత్రం అట్టడుగునే నిలిచిపోయింది.

సోమవారం సాయంత్రం స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత గోవా ఆటగాడు జూలియస్ సీజర్ 24వ నిమిషంలో గోల్ చేసి శుభారంభాన్ని అందించినా.. సెకండాఫ్ మాత్రం కేరళ బ్లాక్ బ్లాస్టర్స్‌కు కలిసొచ్చింది.

మహ్మద్ రఫీ, కెర్వెన్స్ బెల్ఫోర్ట్ చేసిన గోల్స్ తో కేరళ 2-1 స్కోర్ తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో జట్టు రెండో విజయాన్ని సాధించడంతో బ్లాక్ బస్టర్స్ ప్రధాన కోచ్ స్టీవ్ కొప్పెల్ ఆనంద పారవశ్యంలో మునిగిపోగా, రెండో గోల్ చేసిన బెల్ఫోర్ట్.. దాన్ని తన సొంతదేశం హైతీలో హరికేన్ (తుఫాను) బీభత్సంతో అతలాకుతలమైన తన వారికి అంకితంచేశాడు.

Kerala Blasters rally to beat FC Goa

ఇక సొంతగడ్డపై ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైనందుకు గోవా హెడ్ కోచ్ జికో గోవా వాసులకు క్షమాపణ చెప్పారు. మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాలకే కేరళ ప్లేయర్ బెల్ఫోర్ట్.. గోవా డిఫెన్స్ ను దాటుకుని అవుట్ సైడ్ బాక్స్ నుంచి పంపిన బంతిని గోవా గోల్ కీపర్ సుభాషిష్ రాయ్ చౌదరి జయప్రదంగా తిప్పికొట్టాడు.

మరో నాలుగు నిమిషాలకు రఫీ పంపిన బంతి.. గోల్ పోస్ట్ అంచుల మీదుగా దూసుకెళ్లిపోయింది. కానీ 24వ నిమిషంలో గోవా ఆటగాడు సీజర్.. కేరళ వైఫల్యాన్ని అనువుగా మార్చుకుని గుడ్ పొజిషన్‌లోనే బంతిని గోల్ పోస్ట్ కు పంపాడు. తద్వారా కేరళపై గోవా 1 - 0 స్కోర్ తేడాతో ఆధిక్యం సాధించింది.

గోవా గోల్‌కీపర్ సుభాషిష్‌రాయ్ చౌదరి పలుసార్లు ప్రత్యర్థి జట్టు గోల్స్ చేయకుండా సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకున్నాడు. సీజర్ సెకండాఫ్ లో 54వ నిమిషంలో తిరిగి లీడ్ సాధించేందుకు సీజర్ పంపిన బంతి గోల్‌పోస్ట్‌కు చేరలేదు.
సీజర్ చేసిన గోల్‌ను సమం చేయడానికి కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లు మహ్మద్ రఫీ, మెహ్తాబ్ హుస్సేన్ కుడివైపున స్పేస్ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలుచేశారు.

35వ నిమిషంలో సందేశ్ జిజ్నాస్ పంపిన ఫ్రీ కిక్ బంతిని చౌదరి రంగంలోకి దూకేసి అడ్డుకొట్టాడు. ఆ తర్వాత కేరళ సందీప్ నాండే పంపిన బంతిని జోస్ క్యురియస్ హెడ్డర్ ద్వారా గోల్ పోస్ట్ పంపినా ప్రయోజనం లేకపోయింది. చివరి 10 నిమిషాల్లో మిఖైల్ చోప్రాకు గోల్ చేసేందుకు సదవకాశం లభించినా చౌదరి తిప్పికొట్టాడు.

అప్పటి నుంచే గోవా అనూహ్యంగా డిఫెన్సివ్ ఆటలో మెరుపులు మెరిపించింది. కట్టుదిట్టమైన రీతిలో కొనసాగుతున్న డిఫెన్స్ ను విజయవంతంగా దాటుకుని రెండో గోల్ చేసిన బెల్ఫోర్ట్ పై ఆ వెంటనే ఎల్లోకార్డు వేటు పడింది. కానీ అప్పటికే కేరళ తన ప్రత్యర్థిపై 2 - 1 స్కోర్ తేడాతో ఆధిక్యం సాధించింది. చివరిదశలో స్కోర్ ను సమంచేసి మ్యాచ్ ను డ్రా చేయడానికి గోవా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

హరికేన్ హైతీకే అంకితం
ఎఫ్ సి గోవాతో జరిగిన మ్యాచ్‌లో తాను చేసిన విన్నింగ్ గోల్.. సొంతదేశం హైతీలో సంభవించిన హరికేన్ బాధితులకు అంకితమిస్తున్నట్లు కెర్వెన్స్ బెల్ఫోర్ట్ ప్రకటించాడు. పాటోర్డా స్టేడియంలో మెరుగైన ఆటతో రెండు సార్లు కీలక పాస్‌లు, మూడు టేకాన్లతో కేరళ లెఫ్ట్ ఫ్లాంక్ లో కీలక పాత్ర పోషించాడు.

ఇక రెండో విజయం సాధించిన తన కుర్రాళ్లను ప్రధాన కోచ్ స్టీవ్ కొప్పెల్ అభినందనల్లో ముంచెత్తాడు. ఏ విజయమైనా సంతోషాన్ని ఇస్తుందన్నాడు. ఈ దఫా లీగ్ టోర్నీ క్లిష్టంగా మారిందని చెప్పిన కొప్పెల్.. నాలుగు మ్యాచ్‌ల తర్వాత విజయం సాధించడం సాధారణ విసయమేమీ కాదన్నాడు. అటాకింగ్ ధోరణితో తాము ఆడామని, కానీ అది ఫలితాన్నివ్వలేదన్నాడు.

సెకండాఫ్ లో కష్ట సాధ్యమైనా విజయం సాధించడం సంతోషదాయకమని, తదుపరి చెన్నైయిన్ తో తలపడేందుకు సిద్ధమవుతామన్నాడు. బెల్ఫోర్ట్ అద్భుతమైన ల్ చేశాడన్నాడు. సెడ్రిక్ హెంగ్‌బార్ట్ స్పందిస్తూ లీగ్ టోర్నీ చాలా డిఫెన్సివ్‌గా ఉందన్నాడు. సారధి ఆరోన్ హుగెస్ చాలా తెలివైన వ్యక్తని, జట్టు ఆటగాళ్లను కేవలం మ్యాచ్ పైనే కేంద్రీకరించాలని సూచించాడని చెప్పాడు.

గోవా ప్రజలకు జికో సారీ..
సొంతగడ్డపై జట్టు ఓటమి పట్ల గోవా ప్రజలకు కోచ్ జికో క్షమాపణ చెప్పాడు. 24వ నిమిషంలో సీజర్ గోల్‌తో గోవా లీడ్‌లోకి వచ్చినా.. కేరళ కుర్రాళ్లు అనూహ్యంగా దూసుకొచ్చారు. జట్టు ఓటమిపై ఆయన తన నిరాశను ఏమాత్రం దాచిపెట్టుకోలేదు. మెరుగైన ఆట తీరు ప్రదర్శించనందుకు ఫ్యాన్స్‌కు సారీ చెప్పాడు. గతేడాది జట్టుకు, ఈ ఏడాది జట్టుకు చాలా తేడా ఉందన్నాడు. చాలా పటిష్ఠమైన జట్టును తాము ఫేస్ చేయాల్సి వచ్చిందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+