For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఎస్ఎల్: కేరళ ఫ్యాన్స్ అద్భుతమన్న నీతా అంబానీ

ఐఎస్ఎల్ మూడో ఎడిషన్‌లో మద్దతులో కేరళ బ్లాక్ బస్టర్స్ అభిమానులు, మద్దతుదారులే బెస్టని అభివర్ణించిన చైర్ పర్సన్ నీతా అంబానీ .

By Nageshwara Rao

కోచి: సొంతగడ్డపై కేరళ బ్లాక్ బస్టర్స్ ఆడే మ్యాచ్ లకు భారీస్థాయిలో హాజరై మద్దతు తెలిపిన జట్టు ఫ్యాన్స్ కు ఫుట్ బాల్ పట్ల గల మక్కువ ఈ ఏడాది ఐఎస్ఎల్ టోర్నీకే హైలేట్ అని ఐఎస్ఎల్ చైర్ పర్సన్ నీతా అంబానీ అన్నారు. సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా గల కేరళ జట్టు పాల్గొన్న ప్రతి మ్యాచ్ లోనూ సుమారు 55 వేల మంది అభిమానులు పాలు పంచుకుని స్టేడియంను నింపేయడం సర్వ సాధారణంగా మారింది.

ఫీల్డ్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లకు మద్దతుగా ఆసక్తి రేకెత్తిస్తూ శక్తి సామర్థ్యాలు కల్పించిన అభిమానులు ఈ ఏడాది ఐఎస్ఎల్ టోర్నీ ప్రయాణంలో గొప్ప హైలేట్ అని ఫుట్ బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ చైర్‌పర్సన్ నీతా అంబానీ వ్యాఖ్యానించారు.

ఐఎస్ఎల్ టోర్నీలోనే చిరస్మరణీయం

ఐఎస్ఎల్ టోర్నీలోనే చిరస్మరణీయం

‘కేరళ బ్లాక్ బస్టర్స్ పట్ల దయ, కరుణ గల ఫ్యాన్స్ కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు. నాతోపాటు యావత్ ఫుట్‌బాల్ కూటమికి కేరళ ఫ్యాన్స్ స్పందన 2016 ఐఎస్ఎల్ టోర్నీలోనే చిరస్మరణీయం. మీరు అందమైన ఫుట్ బాల్ ఆట పట్ల తిరుగులేని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హోం క్లబ్‌గా కేరళ బ్లాక్ బస్టర్స్ అప్పుడప్పుడు ఓటమి పాలైనా అభిమానుల మద్దతు కొనసాగించడం సంతోషదాయకమైన అంశం. బ్లాస్టర్స్ తో మీ బంధం విడదీయరానిది. గత మూడు ఎడిషన్లలో కోచి స్టేడియానికి 10 లక్షల మందికి పైగా అభిమానులు వచ్చి ఉంటారు' అని ఆమె గుర్తుచేశారు.

నిజమైన క్రీడాస్ఫూర్తికి కేరళ ఫ్యాన్స్ నిదర్శనం

నిజమైన క్రీడాస్ఫూర్తికి కేరళ ఫ్యాన్స్ నిదర్శనం

ఆదివారం ఫైనల్స్ మ్యాచ్ కోసం జట్టు జెర్సీ ధరించి రావడంతోపాటు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినందుకు తామంతా ఆనంద సాగరంలో మునిగిపోయామన్నారు. కోచిలో జరిగిన ఐఎస్ఎల్ 2016 టైటిల్ మ్యాచ్ కు హాజరైన కేరళ ఫ్యాన్స్ నిజమైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనం అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు దన్నుగా, బాసటగా ఫ్యాన్స్ నిలవడం అద్భుతమైన అంశమని, ఇది యావత్ కేరళ ఫుట్ బాల్ ఆట పట్ల చూపుతున్న ఆదరణకు నిదర్శనమని అన్నారు.

నిజమైన హీరోలు కేరళ అభిమానులే

నిజమైన హీరోలు కేరళ అభిమానులే

కేరళలో ఫుట్ బాల్ ఆట పునరుత్తేజం పొందుతుందని తామంతా భావిస్తున్నామన్నారు. ఐఎస్ఎల్ ఫైనల్స్ మ్యాచ్‌లో నిజమైన హీరోలు కేరళ అభిమానులేనని కొనియాడారు. ఫుట్‌బాల్ పండుగను ఆస్వాదించేందుకు మలయాళీలు ముందుకు వచ్చారన్నారు. కేవలం అధిక సంఖ్యలో మలయాళీలు స్టేడియంకు తరలి రావడమే కాక ఒక క్రీడా టోర్నీలోనే అత్యధిక స్థాయిలో అభిమానులు హాజరైన రికార్డు సాధించారని, ఈ ఏడాది టివి వీక్షకుల రేటింగ్ పెరిగిందన్నారు.

ఈస్ట్ బెంగాల్‌లోకి హంకాంగ్ ప్లేయర్ అలెక్స్ అకాండె

ఈస్ట్ బెంగాల్‌లోకి హంకాంగ్ ప్లేయర్ అలెక్స్ అకాండె

ఐ-లీగ్ జెయింట్స్ ఈస్ట్ బెంగాల్ క్లబ్.. ఏషియాన్ ఫుట్ బాలర్స్ కోటాలో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే టోర్నీ కోసం హంకాంగ్ ఇంటర్నేషనల్ అలెక్స్ అకాండె సేవలు వినియోగించుకోనున్నది. నైజీరియాలో జన్మించిన అలెక్స్.. వచ్చేనెలలో జరిగే ఐ - లీగ్ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ జట్టుతో కలిసి ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సౌత్ కొరియన్ డు డాంగ్ హ్యున్ స్థానే అలెక్స్ అకాండె.. ఈస్ట్ బెంగాల్ తరఫున ప్రాతినథ్యం వహిస్తారు. అకాండే కెచే ఎస్ సి తరఫున హంకాంగ్ తో జరిగిన టోర్నీలో ఐఎస్ఎల్ చాంపియన్స్ ఎటికె జట్టుతో ఆడాడు. ఫార్వర్డ్ ప్లేయర్ కూడా అయిన అకాండే 13 మ్యాచ్‌ల్లో 9 గోల్స్ సాధించాడు. 2008లో హంకాంగ్ కు వచ్చిన అకాండే తాయి చుంగ్ క్లబ్ జట్టులో చేరాడు. 2012లో తాపిపో లోచేరిన అకాండె 19 గోల్స్ చేశాడు. ఆ తర్వాత కిచే క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+