Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్‌ఎల్: కేరళ కోచ్ రెనె రాజీనామా చేయనున్నాడా

Kerala Blasters coach Rene Meulensteen resigns

హైదరాబాద్: ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయామని కేరళ ఫుట్‌బాల్ జట్టు వాపోయింది. కాగా ఇదే నేపథ్యంలో ఈ వైఫల్యానికి కోచ్ ప్రధాన కారణమంటూ అభిప్రాయపడ్డారు. ఇంకో పక్క మోహన్ భగన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్న సంజయ్ సోన్ ఇంకొన్ని కారణాల రీత్యా రాజీనామా చేయనున్నాడు.

ప్రస్తుత కోచ్ మెలెన్‌స్టీన్ డిసెంబరు 31 బెంగుళూరు ఎఫ్‌సీతో తలపడిన కేరళ బ్లాక్ బ్లాస్టర్ వైఫల్యం చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మెలెన్‌స్టీన్ ఇంతకుముందు మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ పదవి నిర్వహించాడు. కేరళ జట్టు తర్వాతి ఆటను జనవరి 4న ఎఫ్‌సీ పూణెతో తలపడనుంది.

ఐఎస్ఎల్ 2017-2018కి గాను ఇప్పటి వరకు కేరళ బ్లాస్టర్స్ జట్టు ఒకే ఒక విజయాన్ని అందుకుంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు వైఫల్యానికి ఆటగాళ్ల ఎంపికలోనూ ప్రధాన లోపాలున్నాయని చెప్పవచ్చు.

నా మేనేజ్‌మెంట్‌కు, జట్టులోని క్రీడాకారులకు, ఇతర సిబ్బందికి కృతజ్ఞుడ్ని. మీకు భవిష్యత్ బాగుండాలి అంటూ కేరళ కోచ్ మెలెన్‌స్టీన్ అభిప్రాయపడ్డాడు. జట్టు వైఫల్యానికి స్వచ్ఛందంగా తప్పుకుంటున్న కోచ్ నిర్ణయాన్ని జట్టు యజమాని వరుణ్ త్రిపురనేని ఆమోదించాడు. త్వరలోనే మరో కోచ్‌ను తీసుకోనున్నట్లు వెల్లడించాడు.

అప్పటి వరకు అసిస్టెంట్ కోచ్ థంగ్‌బొయ్ సింటో తాత్కాలిక కోచ్‌గా కొనసాగుతారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 3, 2018, 10:55 [IST]
Other articles published on Jan 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+