సెమీస్‌పై ఆశలు: పుణెపై కేరళ విజయం (ఫోటోలు)
కోచి: డిఫెన్సివ్ ఆటతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టిన కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు సెమీ ఫైనల్స్ ఆశలు సజీవంగా నిలుపుకున్నది. శుక్రవారం రాత్రి కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పుణెతో జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్ 2 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది. 51 వేల మందికి పైగా అభిమానుల మద్దతు మధ్య కేరళ కుర్రాళ్లు చెలరేగిపోయారు.
ఏడో నిమిషంలోనే డకెన్స్ నాజోన్ తొలి గోల్, సెకండాఫ్‌లో సారధి అరోన్ హుగెస్ 57వ నిమిషంలో గోల్ సాధించడంతో కేరళ 2 పాయింట్లతో లీడ్ సాధించింది. ఇంజ్యూరీ సమయంలో 95వ నిమిషంలో పుణె కుర్రాడు సంచలనం అనిబల్ రోడ్రిగెజ్ సాధించి కేరళ స్కోర్ ఆధిక్యాన్ని 2 - 1కు తగ్గించాడు. అయినా కేరళ సెమీ ఫైనల్స్ అర్హత సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది.
కేరళకిది వరుసగా నాలుగో విక్టరీ. సికె వినీత్, కెర్వెన్స్ బెల్ఫోర్ట్, డంకెన్ నాజోన్ సహా మిగతా కుర్రాళ్లు పూర్తిగా పాజిటివ్ ద్రుక్పథంతో ప్రత్యర్థిపై అటాకింగ్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఏడో నిమిషంలో బ్లాస్టర్స్ పాయింట్ సాధించే వరకు సింపుల్‌గా ఆడారు. మహ్మద్ రఫీ గోల్ సాధించడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించే వరకు బంతిని పట్టించుకోలేదు.

తొలి లీడ్ సాధించిన కేరళ
ధర్మరాజ్ రావణన్ బ్యాక్ పాస్ నుంచి పంపిన బంతిని డంకెన్ నాజోన్ షాట్ కొట్టడంతో పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె స్పందించేలోగా గోల్ పోస్ట్ కు చేరుకుని కేరళకు తొలి లీడ్ సాధించి పెట్టింది. 20 నిమిషాల సేపు కేరళ బ్లాక్ బస్టర్స్ బంతిపై, మ్యాచ్‌పై ఆధిపత్యం కొనసాగించారు. మహ్మద్ సిస్సోకో కొద్దిసేపు బంతిపై పట్టు సాధించడంతోపాటు పుణె మిడ్ ఫీల్డ్ కుర్రాళ్లు గోల్స్ సాధించేందుకు అవకాశాలు నెలకొల్పారు. అనిబల్ రోడ్రిగెజ్ పంపిన షాట్ వైడ్‌గా మారి గోల్‌పోస్ట్ మీదుగా వెళుతుండగా నాజోన్ అడ్డుకోవడంతో పక్కకు తప్పుకుని వెళ్లిపోయింది. ఫస్టాఫ్ చివరిక్షణాల్లో పుణె గోల్ సాధించే మంచి అవకాశాన్ని కోల్పోయింది.

స్కోర్ సమం చేసేందుకు పుణె ప్రయత్నం
అరాట ఇజుమి హెడ్డర్ ద్వారా గోల్ పోస్ట్ బంతిని పంపినా పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. తద్వారా స్కోర్ సమం చేసేందుకు పుణె జట్టుచేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. విజిటర్ల జట్టు మ్యాచ్ పై పట్టు సాధించేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఫ్రీ కిక్ ద్వారా పిటూ, హెడ్డర్ ద్వారా సిస్సోకో పంపిన బంతిని ఇజుమి గోల్‌పోస్ట్‌కు పంపితే అది వైడ్‌గా మారి బాక్స్‌ను దాటుకుని వెళ్లిపోయింది. ఆ వెంటనే అప్రమత్తమైన కేరళ కుర్రాడు సికె వినీత్ తక్షణం బంతిని గోల్‌పోస్ట్‌కు మళ్లించినా పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె తిరగొట్టడంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి కేరళ 1 - 0 ఆధిక్యంతో ముందుకు సాగింది.

మ్యాచ్ మొదలైన గంటకే పుణె గోల్
సెకండాఫ్‌లో కేరళ కుర్రాళ్లు నాజోన్, బెల్ఫోర్ట్, మొమ్మార్ డోయే తమ షాట్లతో అలరించినా గోల్ పోస్ట్ వద్ద ఎడెల్ బెటె వాటిని బ్లాక్ చేశాడు. బెల్ఫోర్ట్ మరొకసారి పాస్ ద్వారా గోల్ పోస్ట్ సమీపానికి బంతిని పంపినా ఎడెల్ బెటె ముందు ఆయన ఆటలు సాగలేదు. మూడోసారి బెల్ఫోర్ట్ కొట్టిన కిక్‌ను ఎడెల్ బెటె అసాధారణ రీతిలో సేవ్ చేశాడు. మ్యాచ్ మొదలైన గంట తర్వాత కేరళ బ్లాక్ బస్టర్స్ కు పుణె గోల్ సమర్పించుకోవడం అనివార్యమైంది. వినీత్ కార్నర్ ద్వారా లాబ్ చేసిన బంతిని కేరళ సారధి హుగెస్ హెడ్డర్ ద్వారా గోల్ పోస్ట్ కు విజయవంతంగా పంపేయడంతో రెండో గోల్ సాధించి మ్యాచ్ పై పట్టు బిగించింది.

ఒత్తిడికి గురైన పుణె కుర్రాళ్లు
ఆ వెంటనే ఆంటోనియో జెర్మన్ దూరం నుంచి పంపిన షాట్ ను ఎడెల్ బెటె.. ఫింగర్ టిప్‌తో అడ్డుకున్నది. కేరళ రెండు గోల్స్ సాధించిన తర్వాత ఒత్తిడికి గురైన పుణె కుర్రాళ్లు... కేరళ ఆధీనంలో ఉన్న బంతిని తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ పుణె గోల్ కీపర్ సాహసోపేతంగా వ్యవహరించక పోయి ఉంటే కేరళ కుర్రాళ్లు నాలుగైదు గోల్స్ చేసి ఉండేవారు. మ్యాచ్ ముగింపు దశలో చివరి కొన్ని నిమిషాలకు గోల్ సాధించేందుకు పుణెకు డ్రామానె ట్రారోర్ రూపంలో పాయింట్ బ్లాంక్ గా అందివచ్చిన అవకాశాన్ని కేరళ గోల్ కీపర్ సందీప్ నాండే అడ్డుకున్నాడు.

పుణె ఖాతాలో ఆరో పరాజయం
అనిబల్ రోడ్రిగెజ్ ఇంజ్యూరీ సమయంలో ఐదో నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా గోల్ పాయింట్ సాధించినా అప్పటికే ఆలస్యమై పోయింది. ప్రస్తుత సీజన్‌లో పుణె ఖాతాలో ఆరో పరాజయం చేరింది. దీంతో సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టాలన్న పుణె ఆశలు అడుగంటినట్లే. చివరి క్షణాల ఆశలు ఉన్నా అంత తేలికేం కాదు. అయితే పుణె హెడ్ కోచ్ అంటోనియో హబాస్ మాత్రం తమకు ఇప్పటికీ ప్లేఆఫ్ పై ఆశలున్నాయని వ్యాఖ్యానించాడు. ఈ విజయం తమకు దక్కాల్సిందేనని కేరళ బ్లాక్ బస్టర్స్ చీఫ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications