ఐఎస్ఎల్: ఎట్టకేలకు ప్లేఆఫ్‌కు సచిన్ జట్టు
కోచి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా గల కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు రెండోసారి ప్లేఆఫ్ దశకు దూసుకెళ్లింది. తొలి దశలో దూసుకెళ్లిన నార్త్ఈస్ట్ గ్రూప్ చివరి దశ మ్యాచ్‌లలో వెనుకబడింది. ఆదివారం సాయంత్రం కోచిలో రెండు జట్ల మధ్య అత్యంత ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో 66వ నిమిషంలో ఇండియా ఇంటర్నేషనల్ సికె వినీత్ చేసిన ముఖ్యమైన గోల్‌తో జాన్ అబ్రహం సారధ్యంలోని నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్ సి జట్టుపై 1 - 0 స్కోర్ ఆధిక్యంతో విజయం సాదించింది.
ఈ మ్యాచ్ లో విజయం సాధించిన వారే ప్లేఆఫ్ దశకు వెళ్లనుండటంతో ఇరు పక్షాలు హోరాహోరీ పోరాటం జరిపాయి. ఇరు జట్లకు జీవన్మరణ సమస్య కావడంతోపాటు కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు సొంతగడ్డపై 53 వేల మందికి పైగా అభిమానుల మద్దతు దండిగా ఉండటం సచిన్ సేనకు కలిసొచ్చే అంశంగా మారింది. నార్త్ఈస్ట్‌పై విజయంతో టాప్ 4లో రెండో స్థానాన్ని ఆక్రమించింది. 14 మ్యాచ్‌లలో 22 పాయింట్లతో బరిలో నిలిచిన కేరళబ్లాక్ బస్టర్స్.. తదుపరి మూడో స్థానంలో ఉన్న ఢిల్లీ డైనమోస్ జట్టుతో తలపడనున్నది.

లీగ్ టాపర్స్ ముంబై, కోల్‌కతా
లీగ్ టాపర్స్ ముంబై సిటీ ఎఫ్ సి, మాజీ చాంపియన్లు అట్లెటికో డీ కోల్‌కతా తో ఢీ కొడుతుంది. కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైన నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నది. ఇరు జట్లు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగాయి. కానీ కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లు పూర్తిగా మ్యాచ్‌పై కమాండ్ సాధించారు. మూడో నిమిషంలో లీడ్ సాధించి ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేందుకు విఫలయత్నంచేశారు. ఎడమవైపు నుంచి హైతియన్ ఇంటర్నేషనల్ డకెన్స్ నాజోన్ బంతిని కంట్రోల్‌లోకి తీసుకుని ఇన్‌సైడ్ బాక్స్ వద్దనున్న మైల్సన్ అల్వెస్ వద్దకు బంతిని చేర్చాడు.

బ్రేక్ సాధించేందుకు ఇరు జట్లు ప్రయత్నం
కానీ అల్వెస్ పంపిన బంతిని నార్త్ఈస్ట్ గోల్ కీపర్ టి పి రెహెనేష్ అడ్డుకున్నాడు. అప్పట్నుంచి రెండు జట్ల మధ్య త్వరిగతిన గోల్ సాధించాలన్న తపన మొదలైంది. పరస్పరం బ్రేక్ సాధించేందుకు రెండు జట్లు ప్రయత్నించాయి. పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. కేరళ బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లు పంపిన రెండు ఫ్రీ కిక్ షాట్లు వేస్టయ్యాయి. సెకండాఫ్‌లో విజిటర్స్ జట్టు నార్త్ఈస్ట్ మరింత వేగం పెంచింది. ఇన్‌సైడ్ బాక్స్ వద్దనున్న ఎమిలియానో అల్ఫారో 60వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్ బాట మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలను కేరళ గోల్ కీపర్ గ్రాహంస్టాక్ దిగ్విజయంగా అడ్డుకున్నాడు.

66వ నిమిషంలో మలుపు తిరిగిన మ్యాచ్
66వ నిమిషంలో మ్యాచ్ విధాన నిర్ణాయక దశకు చేరుకున్నది. మహ్మద్ రఫీ బంతిని ముందుకు పంపితే ఎడమవైపున ఉన్న వినీత్ దాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఇన్‌సైడ్‌లో బంతిని కట్ చేసి కుడివైపు నుంచి ప్రత్యర్థి గోల్ కీపర్ రెహెనేష్ అడ్డుకునేలోగా గోల్‌పోస్ట్‌కు మళ్లించాడు. కేరళ గోల్ పాయింట్ సాధించడంతో నార్త్ఈస్ట్ జట్టు ఆశ్చర్యానికి గురైంది. అకస్మాత్‌గా ఓటమి గురవుతామన్న భయంతో జాన్ అబ్రహం జట్టు కుర్రాళ్లు నిరాశకు గురయ్యారు. ఒకవైపు హెడ్ కోచ్ నెలో వింగాడ వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి మార్పులు చేస్తున్నా ప్రత్యర్థి జట్టును ఎదుర్కోలేక చతికిల పడ్డారు.

రెండోసారి ప్లేఆఫ్‌కు కేరళ బ్లాక్ బస్టర్స్
రెండు గోల్స్ చేస్తే గానీ మ్యాచ్ ఫలితం నార్త్ఈస్ట్ జట్టుకు అనుకూలంగా మారదు. ఈ పరిస్థితుల్లో కేరళ బ్లాక్ బస్టర్స్ మరికొన్ని గోల్స్ చేస్తుందా? అన్న సంకేతాలనిచ్చింది. కేరళ బ్లాక్ బస్టర్స్ అప్పటికే లీడ్ సాధించిన రెండు నిమిషాలకే కెర్వెన్స్ బెల్ఫోర్ట్ నేరుగా గోల్ పోస్ట్ కు పంపిన బంతి నార్త్ఈస్ట్ కీపర్ రెహెనేశ్ చేతిలో పడింది. 75వ నిమిషంలో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన అంటోనియో జెర్మన్ కొట్టిన షాట్‌నూ రెహెనేశ్ అడ్డుకున్నాడు. మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాల ముందు పాయింట్ బ్లాక్ దూరంలో రఫీ హెడ్డర్ ద్వారా పంపిన బంతిని కూడా రెహెనేశ్ అడ్డుకున్న తీరు బెస్ట్‌గా నిలిచింది. కానీ మూడేళ్లలో రెండోసారి కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు ప్లేఆఫ్ దశకు వెళ్లకుండా నిలువరించలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications