Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్లాండ్‌పై పైచేయి: రెండో రౌండ్‌కు కషిమా అంట్లేర్స్

యొకొహమా: జపాన్‌లోని యొకొహమాలో గురువారం జరిగిన 2016 ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో కషిమా అంట్లెర్స్ జట్టు ముందడుగు వేసింది. యుకొహమా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అక్లాండ్ సిటీని 2-1 స్కోర్ తేడాతో ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. 50వ నిమిషంలో ఎమిలియానో టేడ్ పంపిన ప్రీ కిక్ బంతిని కిమ్ డాయేవుక్ హెడ్డర్ ద్వారా నేరుగా గోల్ పోస్ట్ దారి పట్టించాడు.

తర్వాత 17 నిమిషాలకు అక్లాండ్ సిటీ ప్లేయర్ షుహెయి అకాసాకి గోల్ సాధించడంతో స్కోర్ సమమైంది. చివరి క్షణం వరకు ఇరు జట్లూ హోరాహోరీ పోటీ పడటంతో అదనపు సమయం తీసుకుంటారని అనిపించినా మ్యాచ్ ముగింపునకు ముందు కషిమా ప్లేయర్ ము కనజాకీ నాటకీయ ఫక్కీలో గోల్ సాధించాడు. దీంతో అక్లాండ్ సిటీపై కషిమా 2-1 స్కోర్ తేడాతో విజయం సాదించి రెండో రౌండ్‌లో అడుగు పెట్టింది.

తదుపరి తొలిసారి ఆడుతున్న మామెలోడీ సన్ డౌన్స్ టీంతో ఈ నెల 11వ తేదీన ఒసాకా టౌన్‌లో కషిమా అంట్లేర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ రికార్డు కూడా సంతరించుకున్నది. ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలో 100వ మ్యాచ్. సాకర్ చరిత్రలో ఫుట్ మ్యాచ్ అసాంతం వీడియో అసిస్టెన్స్ రిఫరీ కోసం వీడియో షూటింగ్ చేయడం ఇదే తొలిసారి. ఆతిథ్య జట్టు అభిమానులు తమ సొంత జట్టుకు గొప్ప స్ఫూర్తినిచ్చారు.

అవిశ్రాంతంగా కేరింతలు కొడుతూ ఫస్టాఫ్ నుంచే కషిమా అంట్లేర్ జట్టుకు మద్దతుగా నిలవడంతో సహజంగానే న్యూజిలాండ్‌కు చెందిన అక్లాండ్ జట్టు ఒత్తిడికి గురైంది. అయినా 17వ నిమిషం వరకు ఆధిపత్యం సాధించే అవకాశం దక్కింది. కషిమా క్రమంగా మ్యాచ్ పట్టు సాధించేందుకు పూనుకున్నది. ఫస్టాఫ్ లోనే బ్రేక్ సాధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

Kashima Antlers fight back to overcome Auckland

యుషుషి ఎండో 25వ నిమిషంలో రెండుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా అక్లాండ్ సిటీ గోల్ కీపర్ ఎనౌట్ జుబికరారీ సేవ్ చేశాడు. బ్రేక్ పూర్తయిన వెంటనే షోమా దోయ్ అద్భుతమైన టెక్నిక్ ప్రదర్శించి అల్బర్ట్ రైరా నుంచి బంతిని వేగంగా ఫ్లిక్ చేసుకుని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్లాడు. కానీ బాక్స్ ఎడ్జ్ వద్ద గోల్ కీపర్ ఎనౌట్ జుబికరారీ మరోసారి అడ్డుకోగలిగాడు.

ఫస్టాఫ్ లో పలు మంచి అవకాశాలు దక్కినా కషిమా అంట్లేర్స్ జట్టు 50వ నిమిషంలో గానీ గోల్ చేయలేకపోయింది. ఎమిలియానో టేడ్ పంపిన బంతిని ఇన్ సైడ్ లో ఉన్న కొరియా డిఫెండర్ కిమ్ నేరుగా హెడ్డర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించడంతో ఒఎఫ్ సి చాంపియన్స్ లీగ్ విజేతలను లీడ్ లోకి తీసుకొచ్చింది.

60వ నిమిషంలో కషిమా ప్లేయర్ డయాగో నిషి క్రాస్ ద్వారా పంపిన బంతిని అక్లాండ్ డిఫెండర్ డార్రెన్ వైట్ పైకెగసి హెడ్డర్ ద్వారా గోల్ పోస్ట్ దారి మళ్లకుండా అడ్డుకోగలిగాడు. కానీ జే లీగ్ కింగ్స్ అక్లాండ్ సిటీ ఫార్వర్డ్ ప్లేయర్లు దూకుడుగా ఆడారు. 67వ నిమిషంలో ర్యోటా నాగాకి బంతిని కట్ చేసి వెనుకకు పిక్ చేశాడు.

అకాసాకి ఇన్ సైడ్ ఏరియాలో బాటం కార్నర్ ద్వారా బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. జే లీగ్ టీం ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి కొనసాగించాలని భావించినా సాధ్యం కాలేదు. 88వ నిమిషంలో ము హెడ్డర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించడంతో కషిమా అంట్లేర్స్ విజయం ఖరారైంది. తదుపరి ఆదివారం ఒసాకా సౌటా సిటీ ఫుట్ బాల్ స్టేడియంలో దక్షిణాఫ్రియా మేమెలోడీ సన్ డౌన్స్ జట్టుతో కషిమా అంట్లేర్స్ తలపడనున్నది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+