
హైదరాబాద్: ఫుట్‌బాల్ క్రీడలో అత్యంత ప్రాధాన్యమిచ్చే అవార్డు బాల్లోన్ డీ ఆర్ అవార్డు. ఇప్పుడైతే ఈ అవార్డు విజేతలుగా క్రిస్టియన్ రొనాల్డో, లియోనల్ మెస్సీ పేరొందుతున్నారు. కానీ, వీరి కంటే ముందు ఆ అవార్డును ముద్దాడిన ఆటగాడు కాకా. ఇక నుంచి ప్రొఫెషనల్ ఆటగాడిగా గేమ్‌కు గుడ్ బై చెప్పాడు. డిసెంబరు 17 ఆదివారం రోజున అతను కొనసాగదలచుకోవట్లేదంటూ నిర్ణయాన్ని వెలిబుచ్చాడు.
బ్రెజిల్ దేశానికి చెందిన కాకా ఏసీ మిలాన్ ఫుట్‌బాల్ క్లబ్ తరపును ఆడి ఎన్నో విజయాలను అందించాడు. 35 ఏళ్ల కాకా తను ఓ ఆటగాడిగా ఇక స్వస్థి చెప్తానంటున్నాడు. అంతేగాక, అదే జట్టులో ఓ స్పోర్ట్స్ డైరక్టర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టబోతున్నాడు. ఫుట్‌బాల్ ప్రపంచ కప్, లా లీగ్, సిరీస్ ఏ విజేత అయిన కాకా క్లబ్‌కు మైదానానికి మధ్య వారధి కాబోతున్నాడు.
ఈ సందర్భంలో అతను మీడియాతో ముచ్చటిస్తూ.. తాను ప్రొఫెషనల్ ఆటగాడిలా పేరొందడానికి చాలా కష్టపడ్డానని అన్నాడు. ప్రతి ప్రొఫెషనల్ ఆటగాడు మంచి స్పోర్ట్స్ డైరక్టర్ అవుతాడని లేదని అన్నాడు. ఈ విధంగా ఎదగడానికి ఎంత కష్టపడ్డానో మళ్లీ ఇంకోలా బాధ్యతలో ఒదగడానికి కూడా నేను అదే స్థాయిలో కష్టపడాల్సిందని అభిప్రాయపడ్డాడు.
తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నానని అన్నాడు. తన కుటుంబసభ్యులుని కూడా సంప్రదించానని పేర్కొన్నాడు. యూరప్ వెళ్లి కొన్ని గేమ్‌లు కూడా చూశానన్నాడు. ఇందులో భాగంగానే నవంబరులో మిలాన్ జట్టు 5-1తేడాతో ఆస్ట్రియా జట్టును ఓడించిన మ్యాచ్‌ను చూశానన్నాడు. ఇక ఇదే సరైన సమయం అని క్రీడాకారుడిగా సెలవు తీసుకోవాల్సిందేనంటూ వివరించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.