న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

భూకంపం రాలేదు.. అంతా వట్టిదే..!!

Jumping Mexicans Didnt Trigger World Cup Earthquake, Say Experts

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ఔత్సాహికులను ఉర్రూతలూగిస్తున్న క్రీడా సంరంభం ఫిఫా వరల్డ్ కప్... కొద్ది రోజుల ముందే మొదలైన ఫిఫా.. ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే, ఆదివారం జర్మనీ.. మెక్సికో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జర్మనీపై మెక్సికో సంచలన విజయం సాధించింది. ఆ చారిత్రక విజయాన్ని మెక్సికన్లు పండుగలా జరుపుకున్నారు. లొజానో గోల్ కొట్టాక... మెక్సికన్ సిటీలో వేలాది మంది పాటలు.. డాన్సులతో హోరెత్తించారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఐతే ఏంజెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్మారక స్థూపం అభిమానులు పెద్ద ఎత్తున గంతులు వేయడంతో భూ ప్రకంపనలు వచ్చాయని ప్రచారం జరిగింది. దానిపై విశ్లేషించిన నిపుణులు.. అదంతా అబద్ధమని అలాంటి ప్రకంపనలు ఏవీ చోటుచేసుకోలేదని వెల్లడించారు.

మెక్సికన్ సిటీలో నమోదైన భూప్రకంపనలు కృత్రిమమైనవి. ప్రపంచ కప్ మెక్సికో జట్టు గోల్‌ సందర్భంగా పెద్ద మొత్తంలో అభిమానులు గంతులు వేయడంతో భూమి కంపించి ఉండవచ్చు. మెక్సికో సిటీలో అలాంటి ప్రకంపనలను కనీసం రెండుసార్లు గుర్తించాం. అని సిమ్సా సంస్థ ట్విటర్‌లో వెల్లడించింది. దీంతో ఆ భూ ప్రకంపనల వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఐతే భూకంపాలను నమోదు చేసే మెక్సికన్ ప్రభుత్వ సంస్థ నేషనల్ సిస్మోలాజికల్ సర్వీసెస్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఈ సమయంలో ఎలాంటి భూ ప్రకంపనలు నమోదుకాలేదని వెల్లడించింది. పెద్ద మొత్తంలో జరిగిన సంబరాలకు అభిమానులు ఎగిరి గంతేస్తే ప్రకంపనలు వస్తాయని.. వాటిని సిస్మోగ్రాఫ్ గుర్తించగలదని.. కానీ అవి భూప్రకంపనలను పోలి ఉండవని స్పష్టంచేసింది. గతంలో ఎఫ్‌సీ బార్సిలానా మ్యాచ్‌లో ప్రకంపనలు నమోదయ్యాయని.. అంతమాత్రన వాటిని భూ ప్రకంపనలుగా ప్రచారం చేయడం సబబు కాదని తెలిపింది.

Story first published: Wednesday, June 20, 2018, 19:52 [IST]
Other articles published on Jun 20, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X