రెండేళ్లలో తొలిసారి బ్రెజిల్ మ్యాచ్ కు జూలియో సీజర్ మిస్
By Pratap
oi-Pratapreddy
దర్బన్: బ్రెజిల్ గోల్ కీపర్ జూలియో సీజర్ గత రెండేళ్లలో తొలిసారి బ్రెజిల్ మ్యాచుకు దూరంగా ఉంటున్నాడు. టాంజానియాతో సోమవారం జరిగే స్నేహపూర్వక మ్యాచ్ నుంచి అతను తప్పుకుంటున్నాడు. జింబాబ్వేతో గత వారం జరిగిన మ్యాచ్ లో ఈ 30 ఏళ్ల ఆటగాడు గాయపడ్డాడు. దీంతో టాంజానియాకు ప్రయాణించే స్థితిలో లేడు.
బ్రెజిలియన్ టీమ్ తో జూలియో సీజర్ ప్రయాణించడం లేదని, ఫిజియోథెరపిస్టు అతనికి చికిత్స అందిస్తున్నాడని బ్రెజిలియన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (సిబిఎఫ్) ప్రకటించింది. గాయం తీవ్రమైందేమీ కాదని, త్వరలోనే జూలియో సీజర్ కోలుకుంటాడని బ్రెజిల్ కోచ్ దుంగా చెప్పారు.