For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లుంగీపై జెర్సీ: పుట్‌బాల్ ఆడిన కేరళ మంత్రి, అర్జెంటీనాకు మద్దతు

By Nageshwara Rao
Jersey With Lungi To Private Stadium, Football World Cup Fans Go All In

హైదరాబాద్: ప్రపంచం మొత్తం సాకర్ ఫీవర్‌తో ఊర్రూతలూగుతోంది. గురువారం రష్యాలోని లుజ్నికి స్టేడియంలో 21వ ఫిఫా వరల్డ్ కప్ ఆరంభ వేడుక అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పుట్‌బాల్ అభిమానులు తాము ఆరాధించే జట్టు గెలవాలని కోరుకుంటున్నారు.

కొందరు నేరుగా రష్యా వెళ్లి దగ్గరుండి తాము అభిమానించే జట్లను ప్రోత్సహిస్తుంటే, మరికొందరు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లకు సంబంధించి భారత పుట్‌బాల్ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

ముఖ్యంగా అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియెనాల్‌ మెస్సీని భారత్‌లో చాలా మంది అభిమానించే సంగతి తెలిసిందే. మెస్సీ అభిమానుల జాబితాలో కేరళ మంత్రి ఎం.ఎం మణి కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనాకే తన మద్దతు అని, మెస్సీ అంటే తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పడంతో పాటు లుంగీపై ఆ జట్టు జెర్సీ ధరించి ఫుట్‌బాల్‌ ఆడారు.

ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో పంచుకొని ఫుట్‌బాల్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

కాగా మెస్సీని అభిమానించే అభిమానుల జాబితాలో టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ కూడా చేరాడు. భజ్జీ తన ట్విట్టర్‌లో 'ఇప్పటి నుంచి దాదాపు నెల రోజుల వరకూ అతని(మెస్సి) కోసం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. గో మెస్సీ గో' అంటూ ట్వీట్‌ చేశాడు.

కాగా, రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు గ్రూపు-డిలో ఉంది. అర్జెంటీనాతో పాటు కోస్టారికా, ఐస్‌లాండ్‌, నైజీరియా కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌లో శనివారం ఐస్‌లాండ్‌తో ఆడనుంది.

Story first published: Friday, June 15, 2018, 15:17 [IST]
Other articles published on Jun 15, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+