Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFC Asian Cup: తొలిసారి టైటిల్ విజేతగా నిలిచిన ఖతార్

Japan 1 Qatar 3: Almoez Ali leads Sanchezs men to maiden AFC Asian Cup title

హైదరాబాద్: అద్భుతమైన ఆటతీరుతో తొలిసారి ఫైనల్‌ చేరిన ఖతార్‌ జట్టు ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో తమకంటే మెరుగైన జట్టు, నాలుగు సార్లు చాంపియన్‌ అయిన జపాన్‌కు షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో ఖతర్‌ 3-1తో జపాన్‌ను ఓడించింది.

మ్యాచ్‌ 12వ నిమిషంలో అల్మొయిజ్‌ అలీ కళ్లుచెదిరే బైస్కిల్‌ కిక్‌తో ఖతర్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత అబ్దుల్‌ అజీజ్‌ హటెమ్‌ 27వ నిమిషంలో మరో గోల్‌ సాధించడంతో ఖతార్ 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇక, రెండో అర్ధభాగంలో జపాన్‌కు ఏకైక గోల్‌ను 69వ నిమిషంలో మినా మినో అందించాడు.

అయితే, చివర్లో అక్రమ్‌ అఫిఫ్‌ 83వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ఖతార్‌ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. దీంతో తొలిసారి పైనల్లోకి చేరిన ఖతార్ జట్టు ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ విజేతగా అవతరించింది.

Story first published: Saturday, February 2, 2019, 10:32 [IST]
Other articles published on Feb 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+