Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైని పైకెత్తిన జాకీ

గౌహతి: నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్ సి జట్టు 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. సుమారు 30 వేల మంది అభిమానుల సమక్షంలో నార్త్ఈస్ట్ గోల్ కీపర్ విల్లింగ్టన్ పొరపాట్లను సానుకూలంగా మార్చుకుని సోనీ నోర్డె పాస్ చేసిన బంతిని జాకీచంద్ సింగ్ తొలిసారి గోల్ పోస్ట్‌కు పంపి జట్టును గెలుపుబాట పట్టించాడు. దీంతో పాయింట్ల టేబుల్‌లో ముంబై సిటీ టాప్‌లో చేరిపోయింది.

వరుసగా మూడు మ్యాచ్ ల్లోనూ జట్టు ఓటమి పాలవ్వడంపై నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు కోచ్ నెలో వింగాడ మండిపడ్డాడు. మరోసారి టాప్ 4 జాబితాలో చేరేందుకు గల అవకాశాలు మిస్ కావడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తమ కుర్రాళ్లు మెరుగ్గా ఆడుతున్నప్పుడు రిఫరీలు అనవసరంగా ఎల్లో కార్డు చూపుతున్నారని వింగాడ నిరసన తెలిపాడు. గత రెండు మ్యాచ్‌లలోనూ మంచి అవకాశాలు కల్పించుకోగలిగినా విజయం సాధించలేకపోయామన్నాడు. ఫస్టాఫ్ ముగియడానికి ముందు కీపర్ చేసిన పొరపాటుతో జాకీచంద్ సింగ్ కొట్టిన కిక్.. గోల్ పోస్ట్‌లో చేరిపోయి ముంబై జట్టుకు ఆధిక్యాన్నిచ్చింది. తొలి నుంచి ముంబై సిటీ, దాని సారధి డియాగో ఫోర్లాన్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ మ్యాచ్ గెలుచుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.

ఆరో నిమిషంలోనూ అద్భుతమైన బంతిని జాకీచంద్ సింగ్ కు గోల్ చేసేందుకు పంపినా వర్కవుట్ కాలేదు. విల్లింగ్టన్ గోమ్స్ దాన్ని గోల్ పోస్ట్ వద్ద అడ్డుకుని జాకీచంద్ ఆశలు అడియాసలు చేశాడు. మరో ఎనిమిది నిమిషాలకు ఫోర్లాన్ పంపిన డేంజరస్ కిక్‌ను అందుకున్న లియోకోస్టా ఫ్రీ హెడ్డర్ ద్వారా గోల్ పోస్ట్‌కు చేర్చేందుకు చేసిన ప్రయత్నాన్ని మైల్సన్ అల్వెస్ తిప్పికొట్టాడు.

Jackichand caps off first start with a winner against NorthEast

ఐదుగురు ఫస్ట్ టీం ప్లేయర్లు గాయాలతో బాధపడుతున్న తరుణంలో నార్త్ఈస్ట్ జట్టు బరిలోకి దిగింది. విల్లింగ్టన్ లిమా గోమ్స్‌ స్టిక్స్ మధ్య తచ్చాడుతుండగా సరిగ్గా నిస్సహాయ స్థితిలో ఉన్న విల్లింగ్టన్ ప్రియరీ, రాబర్ట్ కుల్లెన్ స్థానే మైల్సన్ అల్వేస్ సెంటర్ హాఫ్ రోల్ పోషించేందుకు సిద్ధం అయ్యాడు. మరోవైపు రౌల్లిన్ బొర్గెస్‌తో కలిసి సారధి డిడియర్ జొకొరా ఫీల్డ్ లో చురుగ్గా కదిలాడు. సుమీత్ పస్సీ తొలిసారి అమలుచేస్తున్న 4 - 2 - 3 - 1 మోడల్ వ్యూహాన్ని అమలులోకి తెచ్చాడు.

నార్త్ ఈస్ట్ జట్టుకు 20వ నిమిషంలో తొలిసారి గోల్ చేసేందుకు అవకాశమొచ్చింది. కస్తుమి యుసా పంపిన బంతిని హోలీచరణ్ నార్జారీ నియంత్రణలో తీసుకుని కిక్ కొడితే గోల్ పోస్ట్ మీదుగా వైడ్‌గా మారిపోయింది. మరో పది నిమిషాలకు ఎమిలియానో అల్ఫారోకు మరో 10 నిమిషాల తర్వాత పంపిన బంతిని గోల్ పోస్ట్ కు పంపినా అల్బినో గోమ్స్ చాకచక్యంగా అడ్డుకున్నాడు. నార్త్ఈస్ట్ కస్టోడియన్ విల్లింగ్టన్ బంతిపై ద్రుష్టి పెట్టడాన్ని గమనించిన సోనీ నోర్డె పాస్ చేసిన బంతిని జాకీచంద్ గోల్ పోస్ట్ దారి పట్టించడంతో ముంబై జట్టు విజయం ఖాయమైంది.

సెకండాఫ్ ప్రారంభమైన 11 నిమిషాల తర్వాత రెండో గోల్‌తో మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించేందుకు ముంబైకికి అవకాశం చికి్కంది. క్రిస్జిస్థాన్ వాడొక్ హెడ్డర్ ద్వారా లెఫ్ట్ ఫ్రాక్షన్స్ వైపు పంపిన బంతి గోల్ పోస్ట్ వద్ద వైడ్ గా మారిపోయింది. 72వ నిమిషంలో కోస్తా మరో గోల్ కోసం ప్రయత్నించినా గోల్ కీపర్ నియంత్రించాడు. నార్త్ఈస్ట్ కుర్రాళ్లు చివరి 15 నిమిసాల్లో మాత్రం విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. 76వ నిమిషంలో కార్నర్ నుంచి నార్త్ఈస్ట్ గోల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ఫలితంగా సైత్యాసింగ్ మీదుగా కస్తుమి కార్నర్ నుంచి పంపిన బంతి నేరుగా గోల్ కీపర్ చేతిలో పడింది. మరో ఆసక్తికర విషయమేమిటంటే మరో ప్లేయర్ స్కోర్ షీట్ లో మరో ప్లేయర్ పేరు నమోదుచేసుకున్నాడు. 79వ నిమిషంలో మాటియాస్ డెఫెరెకో పంపిన బ్యూటిఫుల్ పాస్‌ను నార్త్ఈస్ట్ డిఫెన్స్ అడ్డుకున్నది. మ్యాచ్ ముగిసే సమయానికి బంతిపై ముంబై పట్టు కొనసాగించగా, నార్త్ఈస్ట్ స్కోర్ సమం చేసేందుకు ప్రయత్నించింది.

ముంబై కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ స్పందిస్తూ ఇది తాము తప్పక గెలుచుకోవాల్సిన మ్యాచ్ అన్నాడు. ప్రారంభ 15 నిమిషాల్లో మంచి చాన్స్‌లు కల్పించుకున్నా, నార్త్ఈస్ట్ డిఫెన్స్ అడ్డుకున్నదన్నాడు. తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నార్త్ఈస్ట్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. గోల్ కీపర్ అల్బినో గోమ్స్ మొదలు ప్లేయర్లంతా బాగా ఆడారన్నాడు. ఎఎఫ్ సి టోర్నీ ముగిసినందున గోల్ కీపర్లు గోమ్స్ తోపాటు అమరీందర్, అల్బినో అందుబాటులో ఉంటారని, అప్పుడు తలనొప్పి ఉండదని వ్యాఖ్యానించాడు.

గోవా గెలుపుపై కోహ్లీ ప్రశంసల జల్లు

పనాజీ: గోవా సహ యజమాని, వర్కింగ్ యజమాని విరాట్ కోహ్లీ తమ జట్టు పుణెపై విజయం పాధించడం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశాడు. పుణెలో గురువారం జరిగిన మ్యాచ్‌లో పుణె జట్టును గోవా 1 - 0 స్కోర్ తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. టీం ఇండియా టెస్ట్ జట్టు సారధి అయిన కోహ్లీ ఎప్పటికప్పడు తమ జట్టు పెర్పార్మెన్స్‌పై ప్లేయర్స్ కు ఎస్సెమ్మెస్ లు పంపుతూనే ఉన్నాడు. పుణెపై గోవా జట్టును వీక్షించిన కోహ్లీ 'ఈ రోజు గొప్పగా డిఫెన్స్ ఆడారు. అధికారికంగా టైటిల్ గెలుచుకునేందు సమయం వేస్ట్ చేయొద్దు' అని హితవు చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+