Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్‌ 2018కి దూరం: ఇటలీ కోచ్ వెంచురాపై వేటు

Italy sack Ventura after World Cup failure

హైదరాబాద్: 2018లో రష్యా అతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ గియాన్ పియారో వెంచురాపై వేటు పడింది. ఈ మేరకు ఇటాలియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌ఐజీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.

నిజానికి వెంచురాతో కుదుర్చుకున్న ఒప్పందం వచ్చే ఏడాది జూన్‌తో ముగియనుంది. స్వీడన్‌తో కచ్చితంగా గెలువాల్సిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ను ఇటలీ డ్రా చేసుకోవడంతో వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ అర్హత కోసం చివరగా స్వీడన్‌తో జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది.

దీంతో టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వెంచురాను కోరినా.. అతను అంగీకరించకపోవడంతో ఇటాలియన్ ఫుట్‌బాల్ సమాఖ్య వేటు నిర్ణయం తీసుకుంది. కొత్త కోచ్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది.

ఇటలీ కోచ్ రేసులో ప్రస్తుతానికి రియల్ మాడ్రిడ్ కోచ్ కార్లో అన్‌సెలోటి, చెల్సియా మేనేజర్ అంటోనియో కొంటే, జువెంటాస్ బాస్ మాసిమిలానో అలెగ్రి ఉన్నారు. వెంచురా స్ధానాన్ని అన్‌సెలోటి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటాలియన్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.

అయితే ఇటలీ జట్టుకు కొత్త కోచ్ ఎవరనే విషయం మాత్రం సోమవారం తెలియనుంది. కొత్త కోచ్‌పై తుది నిర్ణయం వెలువడనుంది. అయితే ఒక్క ఓటమితో తనను తప్పించడం సరికాదని, గతంలో ఇటలీకి ఎన్నో విజయాలు అందించానని వెంచురా ఆవేదన వ్యక్తం చేశాడు.

2018 వరల్డ్ కప్ టోర్నీకి మొత్తం 32 దేశాలు అర్హత సాధించాయి. జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటలీ, నెదర్లాండ్స్, చిలీ, అమెరికా దేశాలు ఈసారి టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.

2018 వరల్డ్ కప్‌కు దూరమైన అతిపెద్ద దేశంగా ఇటలీ నిలిచింది. అంతేకాదు 60 ఏళ్ల తర్వాత ఇటలీ వరల్డ్ కప్‌కు దూరమైంది. 1958 ప్రపంచకప్‌ తర్వాతి నుంచి ప్రతిసారీ ఈ మెగా టోర్నీలో ఆడుతూ వస్తున్న ఇటలీ 2018లో రష్యా ఆతిథ్యమిస్తోన్న మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 13:25 [IST]
Other articles published on Nov 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+