Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎలా ఉంటుందో!: ఇటలీ, చిలీ, నెదర్లాండ్స్ లేని ఫిఫా వరల్డ్ కప్

Italy, Netherlands, Chile & Top teams who wont be at World Cup 2018

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ మరో 12 రోజుల్లో మొదలు కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో కొన్ని జట్లు కప్పు గెలిచామా లేదా అన్న విషయం పక్కనపెడితే పాల్గొనడమే గొప్ప అదృష్టంగా భావిస్తాయి. జూన్ 14 నుంచి రష్యాలో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు మొత్తం 32 జట్లు అర్హత సాధించాయి.

ఇందులో 20 జట్లు గతంలో ఇదే ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొన్న అనుభవం ఉంది. అయితే, 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇటలీ లేని ఫిఫా వరల్డ్ కప్‌ను మొట్టమొదటిసారి సాకర్ అభిమానులు ఈ టోర్నీలో చూడబోతున్నారు. ఇటీలోత పాటు మరికొన్ని మేటి జట్లు ఈ వరల్డ్ కప్‌కు దూరమయ్యాయి. ఆ జట్లంటే ఒక్కసారి చూద్దామా...!

ఇటలీ

ఇటలీ

ఇటలీ దూరం కావడంతో ఈసారి వరల్డ్ కప్‌లో కళ తగ్గిందనడంలో సందేహం లేదు. చివరిసారి 2000లో ఇటలీ వరల్డ్‌ టైటిల్‌ నెగ్గింది. దిగ్గజ ఆటగాళ్లు జిదానె, హెన్రీ, వియారాలతో అత్యంత పటిష్ఠమైన ఫ్రాన్స్‌ను ఫైనల్లో కంగుతినిపించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. గతంలో 1958లో స్వీడన్‌ అతిథ్య మిచ్చిన వరల్డ్ కప్‌ను మాత్రమే ఇటలీ మిస్సయింది. కాగా, రష్యా ఆతిథ్యమిస్తోన్న ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-జిలో స్పెయిన్‌ చేతిలో 3-0తో ఇటలీ ఓడిపోయింది. అంతేకాదు రెండు అంచెల ప్లేఆఫ్స్‌ నిర్ణాయక మ్యాచ్‌లో స్వీడన్‌పై గోల్‌ చేయడంలోనూ విఫలమైంది. దీంతో ఈ వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.

చిలీ

చిలీ

2014లో వరల్డ్‌క్‌పలో అద్భుత ప్రదర్శన చేసిననప్పటికీ... క్వార్టర్స్‌లో బ్రెజిల్‌ చేతిలో పెనాల్టీలతో కంగుతిన్న చిలీ అప్పటి నుంచి మరింత కసిగా ఆడింది. ఆ వరల్డ్ కప్ తర్వాత రెండుసార్లు కోపా అమెరికా కప్‌ను చేజిక్కించుకుంది. మేటి జట్టు బ్రెజిల్‌పై 2-0 విజయంతో క్వాలిఫయింగ్‌ టోర్నీలో చిలీ శుభారంభం అందుకున్నా.. చివరి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. ఆఖరి క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 3-0తో విజయం సాధించింది. దీంతో చిలీ పాయింట్ల పట్టికలో గోల్స్ తేడాలో మైన్‌సకు పడిపోయింది. అదే సమయంలో గోల్స్‌ తేడాను +1కు మెరుగుపరుచుకున్న పెరూ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది.

 అమెరికా

అమెరికా

ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా స్వదేశంలో జరిగిన నాలుగు మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసింది. ఇక చివరి క్వాలిఫయర్‌లో గెలిచినా లేదా డ్రా చేసినా అమెరికాకు ‘రష్యా' బెర్త్‌ లభించేది. అయితే ట్రినిడాడ్‌ టొబాగో చేతిలో 1-2తో ఓటమి పాలవ్వడంతో అమెరికాకు రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌కు దారులు మూసుకుపోయాయి.

 నెదర్లాండ్స్

నెదర్లాండ్స్

2010లో వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన నెదర్లాండ్స్ ఆ తర్వాత 2014లో జరిగిన వరల్డ్ కప్‌లో వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. అలాంటిది ఈ వరల్డ్ కప్‌కు హాలెండ్‌ అర్హత సాధించలేకపోవడం ఆ దేశ అభిమానులనేకాదు.. మొత్తం ప్ర పంచ ఫుట్‌బాల్‌ అభిమానులను షాక్‌కు గురిచేసింది. హాలెండ్‌ ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ గెలవకపోయినా పుట్‌బాల్‌లో అత్యుత్తమ జట్టుగా ఉంది. ఆ జట్టులో స్టార్ ప్లేయర్లు మార్కో వాన్‌ బాస్టెన్‌, జొహాన్‌ క్రఫీ, డెనిస్‌ బెర్కాంం‌ప్‌తో సహా ప్రస్తుత స్టార్లు అర్జెన్‌ రాబెన్‌, వాన్‌ పెర్సీ, వెస్లే స్నెడర్‌లు ఉండికూడా తమ జట్టు ప్రపంచకప్‌ ఫైనల్‌కు క్వాలిఫై కాకపోవడం నెదర్లాండ్స్‌ ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్, స్వీడెన్ తర్వాతి స్థానంలో నిలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

 కామెరూన్‌

కామెరూన్‌

ఆఫ్రికా సింహాలుగా పేరొందిన కామెరూన్‌ ఏడుసార్లు వరల్డ్ కప్‌లో ఆడింది. అయితే, క్వాలిఫయర్స్‌లో నైజీరియా, జాంబియా తర్వాత తమ గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచింది. మేటి ప్లేయర్‌ శామ్యూల్‌ ఎటో రిటైరైనా ఆ జట్టు గత ఏడాది ఆఫ్రికా కప్‌ను ఐదోసారి గెలుపొందింది. అయితే అదే ఆటను క్వాలిఫయర్స్‌లో పునరావృతం చేయలేకపోయింది. ఆఫ్రికా దేశాలకు వరల్డ్‌కప్‌ క్వాలిఫికేషన్‌ విధానం ఒకింత క్లిష్టంగా ఉంది. ఫైనల్‌ రౌండ్‌లో ఐదు గ్రూపుల విజేతలకే ఫైనల్స్‌కు అర్హత లభిస్తున్న విధానంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కామెరూన్‌‌తో పాటు ఘనా, గ్రీస్‌, బోస్నియా కూడా ఈ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు.

Story first published: Friday, June 1, 2018, 13:07 [IST]
Other articles published on Jun 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+