Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ Vs గంగూలీ: ఫైనల్ మ్యాచ్‌పై ట్విట్టర్‌లో పోరు

హైదరాబాద్: ఐఎస్ఎల్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టు పైనల్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో కేరళ పెనాల్టీ షూటౌట్ ద్వారా 3-0తో ఢిల్లీ డైనమోస్‌పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

దీంతో ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సౌరభ్ గంగూలీ యజమానిగా ఉన్న అథ్లెటికో డీ కోల్‌కతా జట్టుతో కేరళ తలపడనుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్ వన్‌లో కేరళ బ్లాస్టర్స్ రన్నర్స్‌గా నిలవగా, అథ్లెటికో డీ కోల్‌కతా జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.

బుధవారం మ్యాచ్ నిర్ణీత, అదనపు సమయం ముగిసేసరికి ఢిల్లీ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి సెమీస్‌లో కేరళ 1-0తో ఢిల్లీపై గెలువడంతో ఇరు జట్ల స్కోరు 2-2తో సమమైంది. ఈ నేపథ్యంలో సెమీస్ విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

షూటౌట్‌లో తొలుత ఢిల్లీ కెప్టెన్ ఫ్లోరెంట్‌తో సహా బ్రూనో పెల్లిసరీ, ఎమర్సన్ కొట్టిన షాట్లను కేరళ గోల్‌కీపర్ సందీప్ నంది అద్భుతంగా అడ్డుకుని జట్టును గెలిపించాడు. కేరళ తరుఫున క్యూరియస్, బెల్‌ఫోర్ట్, మహ్మద్ రఫీక్ షూటౌట్ గోల్స్ చేసి జట్టుని ఫైనల్స్‌కు చేర్చారు.

దీంతో ఆదివారం ఫైనల్స్‌లో సచిన్ సహా యజమానిగా ఉన్న కేరళ జట్టు, గంగూలీ యజమానిగా ఉన్న కోల్‌కతా జట్టుతో తలపడనుండటంతో ఈ మ్యాచ్ సచిన్ Vs గంగూలీగా మారింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఐఎస్ఎల్‌లో సచిన్ Vs గంగూలీ ట్వీట్స్ చేస్తున్నారు.

సచిన్‌‌తో సౌరభ్ గంగూలీ

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్, అథ్లెటికో డీ కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.

పైనల్స్‌కు దూసుకెళ్లిన కేరళ బ్లాస్టర్స్

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రమంలో ట్విట్టర్‌లో అభిమానులకు సచిన్‌ ధన్యవాదాలు తెలిపాడు.

మైఖెల్ చోప్రా

సెమీ ఫైనల్ విజయం అనంతరం కేరళ బ్లాస్టర్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

అప్పడే ఫైనల్ వచ్చేసిందా?

కేరళ బ్లాస్టర్స్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో అభిమానులు ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.

కోల్ కతాకు అభిమానుల మద్దతు

మరోవైపు ఐఎస్ఎల్ సీజన్ వన్‌లో ఛాంపియన్‌గా అవతరించిన కోల్ కతా మళ్లీ రెండోసారి ఛాంపియన్‌గా అవతరించాలని కోల్ కతా అభిమానులు కోరుకుంటున్నారు.

వికాశ్ కుమార్

కేరళ బ్లాస్టర్స్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో అభిమానులు ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.

సెమీస్‌లో ఢిల్లీ ప్రదర్శన అద్భుతం

కేరళ బ్లాస్టర్స్ చేతిలో ఓటమి పాలైన ఢిల్లీ అద్భుత ప్రదర్శన చేసిందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మెస్సీ లాగా కేరళ బ్లాస్టర్స్

బార్సిలోనా ఎఫ్‌సి స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పెనాల్టీ స్కిల్స్ మాదిరి కేరళ బ్లాస్టర్స్ అద్భుతంగా ఆడిందని కేరళ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+