ఫిఫా 2018: సాకర్ కప్ సంరంభంలో రష్యా ఏకాకి?

మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిర్వహణకు అత్యంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న రష్యా ఒక విషయంలో ఒంటరిపాటుకు గురవుతున్నది. జులై 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు సాగే అత్యంత ప్రజాదరణ గల ఈ క్రీడకు ఆతిథ్యం ఇస్తున్న రష్యాకు హింస, ద్వేషం, దౌత్య రంగంలో సమస్యలు ఆ దేశాన్ని ఒంటరిపాటు చేస్తున్నాయి.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ఫుట్ బాల్ టోర్నీ నిర్వహణలో చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా చూడాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తహతహలాడుతున్నారు. అతిపెద్ద క్రీడా పండుగగా నిర్వహించాలని కోరుకుంటున్నారు. అంతకుముందు 1980లో మాస్కో నిర్వహించిన ఒలింపిక్స్ వివాదాస్పదమైంది.

మెస్సీ, రొనాల్డో తదితరుల భాగస్వామ్యం ఇలా
ఈ టోర్నమెంట్‌లో బ్రెజిల్ సారథి నేయ్మార్, అర్జెంటీనా స్ట్రైకర్ లియానెల్ మెస్సీ, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తదితర దిగ్గజ ప్లేయర్లు పాల్గొననున్నారు. జూలై 15వ తేదీన జూలెస్ రిమెట్ ట్రోఫీని గెలుచుకునేందుకు మెస్సీ, రొనాల్డో, నేయ్మార్ తదితరులు పోటీ పడనున్నారు.

ఫేవరెట్లుగా జర్మనీ, బ్రెజిల్
2014లో బ్రెజిల్ నిర్వహించిన సాకర్ కప్ టోర్నీ పట్ల ప్రపంచంలోని ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఆకర్షితులయ్యారు. 2014 టోర్నీ ఆతిథ్య దేశంగా బ్రెజిల్.. సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో జర్మనీ జట్టుపై 7-1 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. డిపెండింగ్ చాంపియన్‌గా జర్మనీ, గట్టి పోటీదారుగా బ్రెజిల్ జట్లు ఫేవరెట్లుగా ఉన్నాయి. స్పెయిన్‌తోపాటు ఇంతకుముందు ఫిఫా కప్ టోర్నీ గెలుచుకున్న అర్జెంటీనా, ఫ్రాన్స్ కూడా ఫేవరెట్లుగా కొనసాగుతున్నాయి.

పుతిన్ విదేశాంగ విధానంపై పశ్చిమ దేశాల గుర్రు
మరోవైపు వ్లాదిమిర్ పుతిన్ అనుసరిస్తున్న దూకుడైన విదేశాంగ విధానాన్ని పశ్చిమ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎనిమిది ఏళ్ల క్రితం ఆతిథ్య హక్కులు గెలుచుకునేందుకు రష్యా ముడుపులు చెల్లించిందని ఇంగ్లండ్ ఆరోపించింది. సిరియాలో బషర్ అల్ అసద్‌కు మద్దతుగా రష్యా బాంబుల దాడి, క్రెమియా, ఉక్రెయిన్‌లపై వేటు వంటి అంశాలపై పశ్చిమ దేశాలు మండి పడుతున్నాయి.

రష్యాపై అమెరికా, ఇంగ్లండ్ అనుమానాలు
దీనికి 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నదని అమెరికా నిఘా విభాగం విశ్వసిస్తోంది. మాజీ గుడాచారి సెర్జెయి స్క్రిపాల్‌పై విష ప్రయోగం జరిపిందని రష్యాపై ఇంగ్లండ్ మరోసారి ఆరోపణ చేసింది. దీనికి తోడు డోపింగ్ కుంభకోణం.. రష్యా ఆటగాళ్లు తటస్థ దేశం తరఫున ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఒలింపిక్స్‌లో రష్యన్ ప్లేయర్లు మరో దేశం తరఫున ఆడారు. వీటన్నింటి నుంచి బయటపడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకాంక్షిస్తున్నారు.

ప్రారంభ వేడుకకు దూరంగా ఇంగ్లండ్
మాజీ గుడాచారి స్ర్కిపాల్‌పై విష ప్రయోగం సాకుగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చే విందును బహిష్కరించాలని ఇంగ్లండ్, తూర్పు యూరప్ దేశాలు నిర్ణయించాయి. టోర్నీ ప్రారంభ వేడుకకు దౌత్యవేత్తలు గానీ, రాజ కుటుంబ ప్రతినిధులు గానీ హాజరు కారని ఇంగ్లండ్ ప్రకటించింది. స్వీడన్, ఐస్ లాండ్ తదితర దేశాల ప్రధానులు కూడా ప్రారంభ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ మాట్లాడుతూ ఫిపా వరల్డ్ కప్‌ను వీక్షించేందుకు వివిధ దేశాల నుంచి అతిథులు ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నారని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications