
హైదరాబాద్: సాంకేతిక రంగం పెరుగుతున్న కొద్దీ ప్రచారానికి వాడే పద్ధతులు మారుతున్నాయ్. ఇప్పుడు ప్రచారంలో భాగంగా, అంతేగాకుండా అభిమానులను పెంచుకునేందుకు కూడా ఇండియన్ సూపర్ లీగ్ కసరత్తులు ఆరంభించింది. ఫేస్‌బుక్ ప్రవేశ పెడుతున్న మాస్క్‌లను ఉపయోగించి మ్యాచ్‌ను 3డీలో వీక్షించవచ్చు.
అంతే కాకుండా తమ అభిమాన టీం కలర్ మాస్క్‌ను ధరించి వారికి సపోర్టు చేయవచ్చు. వీక్షించేందుకు 3డీ సౌకర్యం కలిగి ఉన్న ఈ మాస్క్‌ల సాయంతో చాలా దగ్గర నుంచి చూస్తున్న అనుభూతిని పొందవచ్చు. ఈ మాస్క్‌లను రంగుల వారీగా 10 హీరో క్లబ్‌లకు ఒక్కొక్క టీంకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
కోల్ కత్తా (ఏటీకే), బెంగుళూరు(బెంగుళూరు ఎఫ్ సీ), చెన్నయిన్ ఎఫ్‌సీ, ఢిల్లీ (ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ), గోవా (ఎఫ్‌సీ గోవా), పూణె (ఎఫ్‌సీ పూణె సిటీ), జంషెడ్ పూర్ (జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ), కేరళ (కేరళ బ్లాస్టర్ట్స్ ఎఫ్‌సీ), ముంబై (ముంబై సిటీ ఎఫ్‌సీ), నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీలకు తన టీంలను బలపర్చుకోవచ్చు.
Tips to use club's mask on Facebook:
Swipe right on your Facebook newsfeed to open the new Facebook camera.
Tap on the magic wand icon to bring up the tray of effects for the camera
Select the mask of your favourite ISL Club
Capture an image or video and share with your friends.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.