కోచి: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కేరళ బ్లాక్‌బస్టర్స్‌పై విజయం తమదేనని ముంబై సిటీ ధీమాగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లు సాధించిన ముంబై.. గాయం వల్ల సారధి డియాగో ఫోర్లాన్ గైర్హాజరీలోనూ తమ పయనం ముందుకేనని విశ్వాసం ప్రకటిస్తుంది.
కేరళ బ్లాక్‌బస్టర్స్ సారధి కెడ్రిక్ హెంగ్‌బార్ట్ గత మ్యాచ్ మధ్యలోనే గాయంతో వైదొలడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమే. హెంగ్‌బార్ట్ వంటి వారియర్ లోటు తీర్చలేనిదైనా ఆయన స్థానం భర్తీకి ప్రయత్నిస్తామని కేరళ చీఫ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ వ్యాఖ్యానించారు.
యూరోపియన్ చాంపియన్‌షిప్ - 2016 సెకండ్ రౌండ్ ముగియడంతో కెప్టెన్ అరోన్ హుగెస్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని అంచనావేస్తున్నారు. తమ కుర్రాళ్లు కష్ట పడుతున్నా అవకాశాలు కల్సి రావట్లేదని కొప్పెల్ వ్యాఖ్యానించారు. ఆటగాళ్లంతా తమ బాధ్యతలేమిటో అర్థంచేసుకున్నారని, విజయం సాధించడమే వారి ఆకాంక్షగా పెట్టుకున్నారన్నారు.
పుణె, నార్త్‌ఈస్ట్ జట్లతో వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఫోర్లాన్ గాయం వల్ల ముంబైకే పరిమితం కానున్నాడు. తన గాయం నుంచి త్వరితగతిన రికవరీకి ప్రయత్నిస్తున్నాడని ముంబై కోచ్ అలెగ్జాండ్రీ పేర్కొన్నాడు.
రెండు వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై జట్టు పరిస్థితి ఆశాజనకంగా ఉందని, తొలి మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది పాయింట్లు సాధించాలని తాము లక్ష్యంగా పెట్టుకుంటే ఏడు పాయింట్లు పొందామని అలెగ్జాండ్రీ అన్నాడు. ప్రస్తుతం మెరుగైన ఆటతీరుకే ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపాడు.

ఇరు జట్లకు విజయానికి సమాన అవకాశాలు ఉన్నాయి. అయితే కోచిలో సుమారు 55 వేల మంది అభిమానుల మద్దతుతోపాటు గెలుపు కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్న కేరళ బ్లాక్‌బస్టర్స్‌ను ఎదుర్కోవడం అంత తేలికేం కాకపోవచ్చు.
దేశదేశాల్లో ఐఎస్‌ఎల్ ప్రసారాలు
ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) లీగ్ మ్యాచ్‌లపై అన్ని దేశాల దృష్టి పడింది. పలు దేశాల్లోని కేబుల్ ఆపరేటింగ్ నెట్‌వర్క్‌లు ఐఎస్‌ఎల్ మ్యాచ్‌లు క్రమం తప్పకుండా ప్రసారంచేస్తున్నాయి. భారత్‌లో అధికారిక ప్రసార హక్కులను పొందినస్టార్ ఇండియా చానెల్‌తోపాటు స్టార్ స్పోర్ట్స్ వన్, స్టార్ స్పోర్ట్స్‌లలో ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాలో 'ఫాక్స్', బ్రెజిల్‌లో టర్నర్, మిడిల్‌ఈస్ట్‌లో అబుదాబీ మీడియా కార్పొరేషన్, నార్త్ అమెరికా దేశాల్లో నార్వే వైశాట్, సబ్ సహరన్ ఆఫ్రికా దేశాల్లో సెతాంత, బ్రిటన్‌లో సోనీ, చైనాలో లీ టీవీ ఈ మ్యాచ్‌లకు ప్రసారం చేస్తున్నాయి.