ఓటమితో నిరాశ: భుజంపై చెయ్యేసి ఓదార్చిన సచిన్
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 3 ఎడిషన్ టైటిల్ చేజిక్కించుకునే అవకాశం కోల్పోయి నిరాశా నిస్ర్పుహతో ఉన్న తన కుర్రాళ్లకు ప్రేరణ కల్పించేందుకు కేరళ బ్లాక్ బస్టర్స్ సహ యజమాని సచిన్ టెండూల్కర్ పూనుకున్నారు.
టైటిల్ పోరులో ఓటమితో భారీ నైరాశ్యానికి గురైన కుర్రాళ్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు గతంలో తాను క్రికెటర్‌గా ఉన్నప్పుడు పలు ప్రపంచ కప్ టోర్నీల్లో టీం ఇండియా వైఫల్యాల నేపథ్యాన్ని వివరించి వారిని ఊరడింపజేశారు. ఈ నెల 18న ఐఎస్ఎల్ ఫైనల్స్ టోర్నీ ముగిసిన మరుసటి రోజే తిరిగి ముంబైకి వెళ్లకుండా కోచిలోనే ఉండి తన టీం కుర్రాళ్లతో భేటీ అయ్యారు.
సోమవారం ఉదయమంతా వారితోనే గడిపి పునరుత్తేజాన్నిచ్చారు. కేరళ బ్లాక్ బస్టర్స్ గోల్ కీపర్ సందీప్ నాండీ ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం, టెండూల్కర్ వెంటనే ముంబైకి వెళ్లిపోలేదు. రోజంతా మాతోనే గడిపారు' అని చెప్పాడు.
సోమవారం ఉదయం తమతో కలిసే అల్ఫాహారం, మద్యాహ్నం భోజనం చేశారని, ఆ తర్వాతే ముంబై బయలుదేరి వెళ్లారని చెప్పాడు. తాను క్రికెటర్‌గా విఫలమైనప్పుడు నిరాశకు గురి కాకుండా ఎలా పునరుత్తేజం పొందారో తమకు వివరించారని చెప్పాడు.

తమలో ఆత్మస్థైర్యం నింపారు
టైటిల్ పోరులో కేరళ తరఫున గోల్ చేసిన మహ్మద్ రఫీఖ్ మాట్లాడుతూ సచిన్ తన 22 ఏళ్ల కెరీర్‌లో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, కష్టకాలం గురించి వివరించి తమలో ఆత్మస్థైర్యం నింపారన్నారు. ‘ప్రపంచ కప్ టోర్నీలో ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్‌గా ఐదో స్థానంలో వచ్చి ఆడినా టైటిల్ గెలువలేకపోవడంతో తానెంత ఒత్తిడి, బాధకు గురయ్యారో చెప్పారు. కానీ తానెప్పుడు నిరాశకు గురై కెరీర్ నుంచి తప్పుకోలేదని, భారత్‌లో తన ఆరవ వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ గెలుచుకునే అవకాశం లభించిందని మాతో చెప్పారు' అని ఇస్ఫాక్ అహ్మద్ తెలిపారు.

సచిన్ పెప్ టాక్
భారత్ ఫుట్ బాలర్స్ లో అనుభవం గల ప్లేయర్ ఇస్ఫాక్ మాట్లాడుతూ సచిన్ పెప్ టాక్ తో తమను ఒప్పించేందుకు.. తాను పదేపదే దెబ్బతిన్నప్పుడల్లా నిరాశకు గురి కాకుండా అవిశ్రాంతంగా పోరాడుతూ తదుపరి ట్రోఫీలో లక్ష్య సాధన దిశగా ఆయన ప్రయాణం ఎలా సాగించారో వివరించాడన్నాడు.

షిల్లాంగ్ లాజొంగ్ తో మిడ్ ఫీల్డర్ రొకస్ జట్టు
ఐ -లీగ్ టీం షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి జట్టు అనుభవం గల ఇండియన్ టీం మిడ్ ఫీల్డర్ రొకస్ లామారెతో జట్టు కట్టింది. 2016 - 17 సంవత్సరానికి ఐ - లీగ్ టోర్నీలో రోకస్ లామారెను తమ జట్టు తరుఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు మంగళవారం క్లబ్ యాజమాన్యం, ఆయనతో ఒప్పందంపై సంతకాలు చేశారు. లామారె భారత జట్టుకు 14 సార్లు సారథ్యం వహించారు. 2001లో తొలిసారి లాజోంగ్ ఎఫ్ సి లోగో ధరించిన రోకస్ లామారె 2003 - 2004లో మొహున్ బగన్ తో కలిసి పనిచేశారు. తర్వాత పలు సంవత్సరాల పాటు గోవా క్లబ్ సాల్గావోంకర్ క్లబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి ఎండి లార్సింగ్ మింగ్ సావ్యాన్ మాట్లాడుతూ తమ తొలి క్రీడాకారుడు లామారె అని కొనియాడాడు.

డిఎస్‌కె శివాజియన్స్‌తో జెర్రీ, సంజు టైఆఫ్
ఐ - లీగ్ క్లబ్ డిఎస్ కె శివాజీయన్స్ ఎఫ్ సి జట్టులో జెర్రీ లాల్రింజౌలా, సంజూ ప్రధాన్ చేరారు. ఇండియన్ సూపర్ లీగ్ లో చెన్నైయిన్ ఎఫ్ సికి లాల్రింజౌలా, ఎఫ్ సి పుణె సిటికీ సంజూ ప్రధాన్ ప్రాతినిధ్యం వహించారు. ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో లాల్రింజౌలా 18 ఏళ్ల వయస్సులో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. యు - 14 నుంచి యు - 19 టీం వరకు ప్రతి జట్టులోనూ లాల్రింజౌలా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. లాల్రింజౌలా తనకు చిన్నప్పటి నుంచే తెలిసిన కుర్రాడని డిఎస్ కె కోచ్ డేవి రోజర్స్ వ్యాఖ్యానించాడు. ఇక సంజూ ప్రధాన్ భారత్ ఫుట్ బాల్ సర్క్యూట్ లోనే చాలా అనుభవం గల ప్లేయర్, ఆయన శక్తి సామర్థ్యాలు తమ జట్టుకు ఉపకరిస్తాయని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications