Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్‌ఎల్: ప్రత్యర్థి కోల్‌కత్తా జట్టును గెలిపించిన రాబిన్ సింగ్ హుడ్

ISL: Robin Singh hoodwinks Mumbai City as ATK register first victory

హైదరాబాద్: ఎంత ఆశగానో ముంబై సిటీపై విజయం సాధించేందుకు ఆరాటపడ్డ కోల్‌కత్తా జట్టు కల నెరవేరింది. కోల్‌కత్తా జట్టుకు ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుకు ఆదివారం మ్యాచ్ జరిగింది. ముంబై స్పోర్ట్స్ ఎరేనా వేదికగా జరిగిన ఈ హోరాహోరీ పొటీలో చివరికి కోల్‌కత్తా జట్టు 1-0తేడాతో గెలుపొందింది. లీగ్ మొదలైనప్పటి నుంచి కోల్‌కత్తాకు ఇదే మొదటి విజయం.

మూడు పాయింట్లను లక్ష్యంగా పెట్టుకుని మ్యాచ్ ఆరంభించిన ముంబైకి నిరాశే మిగిలింది. ఈ మూడు పాయింట్లు సాధిస్తే టాప్ ఫోర్త్ స్థానంలోకి వెళ్లి పూణె సిటీ జట్టును ఓడించాలనేది ముంబై జట్టు కోరిక. మరోపక్క లీగ్ పట్టికలో 7 పాయింట్లున్న ముంబై సిటీని ఓడించడమే లక్ష్యంగా 2 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉన్న కోల్‌కత్తా జట్టు ఓడించింది.

ఆట మొదటి నుంచి ముంబై జట్టకు చెందిన ఆటగాడు అమరీందర్ సింగ్ ప్రత్యర్థికి గోల్ కాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. 37వ నిమిషంలో అలెగ్సాండర్ గ్యుమారాస్ ఓ కార్నర్ పాయింటును గెలుచుకునే ప్రయత్నం చేశాడు. కానీ, కోల్ కత్తా జట్టు క్రీడాకారుడు జెక్విన్హా దాన్ని నిరోధించి ప్రత్యర్థికి పాయింటు రాకుండా ఆపాడు.

ఇలా మొదటి భాగం పూర్తయిన తర్వాత రెండో భాగంలో 54వ నిమిషం ముంబై సిటీ జట్టు ఆటగాడు రాబిన్ సింగ్ హుడ్ బంతితో తన జట్టు గోల్ చేయాలని ఆరాటపడగా దాన్ని కోల్‌కత్తా జట్టు ఆటగాడు జెక్విన్హా తమ వైపుకు తిప్పుకుని జట్టుకు ఒకే ఒక్క పాయింటు తెచ్చి గెలిపించాడు. తర్వాత ప్రత్యర్థి జట్టుకు ఒక్క పాయింటు కూడా రాకుండా చేయడంతో విజేతగా నిలిచారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 11:09 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+