న్యూఢిల్లీ: హీరో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్) అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నార్త్ఈస్ట్ యూనైటెడ్ ఎఫ్‌సీ (ఎన్ఈయూఎఫ్‌సీ).. ఉరుగ్వేన్ స్ట్రైకర్ ఎమిలియానో ఆల్ఫారో, బ్రెజిలియన్ అటాకింగ్ మిడ్ ఫీల్డర్ ఫాబియో నేవ్స్ ఫ్లోరింటినోలను తమ జట్టులోకి తీసుకుింది.
ఈ సందర్భంగా ఎన్ఈయూఎఫ్‌సీ యజమాని జాన్ అబ్రహామ్ మాట్లాడుతూ.. 'ఎన్ఈయూటీడీలోకి ఈ ఇద్దరు కొత్త ఆటగాళ్లు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఆల్ఫారో, ఫాబియోలు ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు. వారి ప్రాతినిథ్యంతో తమ జట్టు బలం పెరిగింది. ఈ సీజన్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తారనడంలో అతిశయోక్తి లేదు' అని తెలిపారు.

ఎన్ఈయూఎఫ్‌సీ ఫుట్‌బాల్ డైరెక్టర్ ఆర్దేషిర్ జీజీభోయ్ మాట్లాడుతూ.. 'ఈ సీజన్లో కొత్తగా వచ్చిన ఈ ఆటగాళ్లతో తమ జట్టు బలం పెరిగినట్లయింది. ఆత్మ విశ్వాసంతో మా జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నా' అని చెప్పారు.
జాతీయ స్థాయిలో ఆల్ఫారో.. ఉరుగ్వే అండర్-17, అండర్-20, సీనియర్ నేషనల్ టీంకు ప్రాతినిథ్యం వహించాడు. ఉరుగ్వే, అర్జెంటీనా, ఇటలీ, యూఏఈలలలో నిర్వహించిన క్లబ్ లెవల్ లీగ్‌లలో ఇతడు అద్భుతంగా రాణించాడు. ఇక బ్రెజిలియన్ ఆటగాడు ఫాబియో కూడా అటాకింగ్ మిడ్ ఫీల్డర్. బ్రెజిల్, సౌత్ కొరియాల్లో ఇతడు చాలా క్లబ్ లెవల్ లీగ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు.