Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియన్ సూపర్ లీగ్ : మరోసారి ముంబై సిటీ ఎఫ్.సీ తరుపున సునీల్ ఛత్రీ

ముంబై : ఇండియన్ సూపర్ లీగ్ అవుట్ ఫిట్ ముంబై సిటీ ఫుట్ బాల్ క్లబ్ రెండోసారి ఇండియన్ కెప్టెన్ మరియు స్ట్రైకర్ అయిన సునీల్ ఛత్రీని తమవైపే నిలుపుకుంది. క్యాష్ రిచ్ ఫ్రాంచైజీ నేత్రుత్వంలో జరగబోయే మూడో సీజన్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక 32 ఏళ్ల సునీల్ ఛత్రీ రెండోసారి కూడా ముంబై సిటీ ఫుట్ బాల్ క్లబ్ స్టార్ స్ట్రైకర్ పాత్ర పోషించనున్నాడు. ఇప్పటికే 51 అంతర్జాతీయ గోల్స్ తో ఇండియాలోనే అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తిగా సునీల్ ఛత్రీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు 2015 16 మధ్య సీజన్ లో ఐ లీగ్ ఛాంపియన్స్ బెంగుళూరు ఫుట్ బాల్ క్లబ్ తరుపున కూడా సునీల్ ఛత్రీనే టాప్ లోనే నిలవడం గమనార్హం.

ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ గా మోహన్ బగన్ క్లబ్ తరుపు కలిసి కెరీర్ సాగించిన సునీల్ ఛత్రీ.. ఆ తర్వాత రోజుల్లో ప్రముఖ సాకర్ క్లబ్ కనాస్ సిటీ విజర్డ్స్ తరుపున కూడా 2010లొ ప్రాతినిధ్యం వహించాడు. ఇండియా తరుపున మేజర్ సాకర్ క్లబ్ లో చోటు దక్కించుకున్న తొలి ఇండియన్ కూడా సునీల్ ఛత్రీనే కావడం విశేషం.

ISL: Mumbai City FC retained Sunil Chhetri for 2016 season

అనంతరం పోర్చుగీస్ గియాంట్స్ స్పోర్ట్స్ క్లబ్ తరుపున బి టీమ్ కు కూడా ప్రాతినిద్యం వహించాడు సునీల్ ఛత్రీ. ఇండియన్ ఫుట్ బాల్ లో చెప్పుకోదగ్గ పెద్ద జట్లయిన డెమో ఎస్సీతో పాటు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగన్ మరియు బెంగుళూరు ఫుట్ బాల్ క్లబ్ లకు సునీల్ ఛత్రీ ప్రాతినిధ్యం వహించాడు.

తాను ఆడిన రెండో మ్యాచ్ లో రెండుసార్లు స్కోర్ చేయడం చేయడం ద్వారా.. 2015 సీజన్ లో ముంబై సిటీ ఫుట్ క్లబ్ తన తొలి విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత సంవత్సరం ఇండియన్ సూపర్ లీగ్ లో ఏడు గోల్స్ సాధించడం ద్వారా అత్యధిక గోల్స్ నమోదు చేసిన ఇండియన్ ప్లేయర్ గా రికార్డు సాధించాడు. ఇందులో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ పై సాధించిన ఓ హ్యాట్రిక్ గోల్ కూడా ఉండడం విశేషం.

ఇక రెండోసారి ముంబై ఫుట్ బాల్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు సునీల్ ఛత్రీ. ముంబై ఫుట్ బాల్ క్లబ్ ను గొప్ప క్లబ్ అంటూ పొగిడిన సునీల్ ఛత్రీ.. క్లబ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమేజింగ్ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. రన్ బీర్, పర్కేష్, ఇంద్రనీల్ వంటి ఆటగాళ్లతో కూడిన జట్టుతో ఆడడానికి చాలా ఆత్రుతతో ఉన్నానని తెలిపారు. ముంబై టీమ్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని మంచి ఫలితాన్ని రాబట్టడానికి తన శాయ శక్తుల కృషి చేస్తానని చెప్పాడు సునీల్.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+