
హైదరాబాద్: డిసెంబరు 10 ఆదివారం ముంబై సిటీ ఎఫ్‌సీ విజయోత్సహంతో ముగించింది. ఇండియన్ సూపర్ లీగ్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆదివారం ముంబై జట్టు చెన్నై జట్టుతో తలపడింది. ఈ హోరాహోరీ పోరులో హ్యాట్రికీ విజయాలతో దూసుకుపోతున్న చెన్నై జట్టుకు కళ్లెం పడింది. చివరి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 1-0తో గెలిచింది.
ఒక్క గోల్.. ఒకే ఒక్క గోల్..
60వ నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు సున్నా స్కోరును చేధించేందుకు ప్రయత్నించాయి. అరవైవ నిమిషంలో ఎచిల్లె ఎమనా సహకారంతో బల్వంత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దాంతో ఒక పాయింటు ముంబై సిటీ ఎఫ్‌సీ ఖాతాలో పడింది. మ్యాచ్‌కు ఈ ఒక్క పాయింట్ కీలకంగా మారి ముంబై జట్టుకు విజయాన్ని చేకూర్చింది.
ఈ విజయం అనంతరం ముంబై టీం సూపర్ లీగ్ స్కోరు బోర్డులో ఏడు పాయింట్లతో అయిదో స్థానాన్ని దక్కించుకుంది. పరాజయం అనంతరం కూడా చెన్నై మూడో స్థానంలోనే కొనసాగుతుంది. 2015 సంవత్సరంలో 5 మ్యాచ్‌లు గెలిచిన రికార్డున లక్ష్యంగా పెట్టుకుని ముంబైకి చేరిన చెన్నై జట్టుకు నిరాశే మిగిలింది. చెన్నై ప్రయత్నాలు చేయక మానలేదు. 29, 45వ నిమిషాలలో రఫీ ప్రయత్నించాడు. కానీ, అది ఓ సారి జుడె నొరుహ్ అడ్డుకోగా, మరోసారి అమరీందర్ సింగ్ ఆపాడు.
75వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని ఎవర్టొన్ సాంతోస్ చేజార్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.