Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: మాలౌదాకే ‘హీరో ఆఫ్ ది లీగ్’ అవార్డు

కోచి: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఢిల్లీ డైనమోస్ ప్లేయర్, బ్రెజిలియన్ స్ట్రయికర్ మార్సిలిన్హో ఈ సీజన్ టోర్నీ టాప్ స్కోరర్ గా గోల్డెన్ బూట్ అవార్డు అందుకుంటే.. ఆయన జట్టు సారధి - ఫ్రాన్స్ ఆటగాడు ఫ్లోరెంట్ మాలౌదా 'హీరో ఆఫ్ ది లీగ్' అవార్డు అందుకున్నాడు. రెండోసారి చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సౌతాఫ్రికా వింగర్ సమీగ్ దౌటీ 'విన్నింగ్ పాస్ ఆఫ్ ది లీగ్' అవార్డు లభించింది.

ఇక ముంబై సిటీ ఎఫ్ సి గోల్ కీపర్ అమరిందర్ సింగ్ 'గోల్డెన్ గ్లోవ్' అవార్డు స్వీకరించారు. మాజీ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సి జట్టులో 18 ఏళ్ల జెర్రీ లాల్రింజులా 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది లీగ్' అవార్డు పొందారు. ఢిల్లీ ప్లేయర్ మార్సిలిన్హో 10 గోల్స్ చేయడంతోపాటు ఐదు గోల్స్ చేయడంలో ఇతర ప్లేయర్లకు అసిస్టెన్స్ అందించాడు. ఎఫ్ సి గోవాతో జరిగిన మ్యాచ్ లో ఆయన సాధించిన హ్యాట్రిక్ గోల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఢిల్లీ సారధి మాలౌదా టోర్నమెంట్ అసాంతం టీం వనరులను వెలికితీస్తే మ్యాచ్ లపై నియంత్రణ సాధిస్తూనే మూడు గోల్స్ చేశాడు, మరో ఐదో గోల్స్ సాధనకు అవకాశాల కల్పనలో సహకరించాడు. ఎటికె ప్లేయర్ బొర్జా ఫెర్నాండెజ్ 'ఫిట్టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది లీగ్' అవార్డును అందుకుంటే.. నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 'బెస్ట్ పిచ్', మాజీ చాంపియన్ చెన్నయిన్ ఎఫ్ సి 'ఫెయిర్ ప్లే అవార్డు' పొందాయి,

తన భవితవ్యం సంగతి చెప్పని మొలీనా

ఎటికె కోచ్ జోస్ మొలీనా తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటో బయట పెట్టలేదు. కానీ ఎటికె గెలుచుకున్న టైటిల్ విజయాన్ని కుటుంబానికి అంకితం చేశాడు. ప్రస్తుతం పండుగ చేసుకోవాల్సిన సమయమని, భవిష్యత్ గురించి తర్వాత నిర్ణయిస్తానని చెప్పాడు. 'వచ్చే ఏడాది ఐఎస్ఎల్ టోర్నీ ఎప్పుడు జరుగుతుంది? ప్రస్తుతం దాని గురించి ఎవరికి తెలియదు. కనుక నేను నా సొంతదేశం స్పెయిన్‌లో ఉన్న నా కుటుంబంతో గడిపేందుకు వెళతాను' అని అన్నాడు.

ISL: Marcelinho bags Golden Boot, Malouda named Hero of the League

ఎటికె కోచ్‌గా దీవెనలు అందుకున్న నేను చాలా సంతోషాన్ని ఎంజాయ్ చేశా' అని తెలిపాడు. చాలా కాలం పాటు దూరంగా ఉన్నందున టోర్నమెంట్ టైటిల్ గెలుచుకోవడాన్ని కుటుంబానికి అంకితంచేస్తున్నట్లు ప్రకటించాడు. మొత్తం ఫ్రాంచైసీ యావత్తు టీం వర్క్ తో ముందుకు సాగడం వల్లే టైటిల్ ను ఎటికె గెలుచుకోగలిగిందని తెలిపాడు. అదనపు సమయం పూర్తయిన తర్వాత విజయం తమ సొంతమవుతుందని ప్లేయర్లతో చెప్పినట్లు గుర్తుచేశాడు.

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, సంయమనం పాటించాలని తన కుర్రాళ్లకు హితబోధ చేశానని మొలీనా తెలిపాడు. తమ కుర్రాళ్లు షూటౌట్ పెనాల్టీలు కొట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నాడు. తొలుత ఇయాన్ హుమ్ షూటౌట్ మిస్సయినా తాను ఆందోళనకు గురి కాలేదన్నాడు. చివర్లో జువెల్ రాజా వచ్చి షూటౌట్ చేయడంతో విజయం జట్టును వరించిందని గుర్తుచేశాడు.

వచ్చే ఐ - లీగ్ టోర్నీ చాలా టఫ్: ట్రెవోర్ మోర్గాన్

వచ్చేనెలలో ప్రారంభం కానున్న ఐ - లీగ్ టోర్నీ అసాంతం పోటాపోటీగా ఉంటుందని ఈస్ట్ బెంగాల్ కోచ్ ట్రెవొర్ మోర్గాన్ తెలిపాడు. ఈ దఫా టోర్నమెంట్‌లో పది జట్లు పాల్గొంటాయని, వాటిలో కొన్ని జట్ల గురించి మాత్రమే తమకు తెలుసునని చెప్పాడు. సోమవారం నుంచి ఈస్ట్ బెంగాల్ జట్టు ట్రైనింగ్ ప్రారంభించింది.

మిగతా వారి మాదిరిగానే తాను కూడా ఐ - లీగ్ టోర్నీ గెలుచుకోవాలని కల కంటున్నానని తెలిపడు. భారత్ లోనే ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టును బలమైన జట్టుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపాడు. సుదీర్ఘ కాలం పాటు 18 మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నదన్నాడు. అయితే ఇప్పటికీ ఈస్ట్ బెంగాల్ జట్టు తిరిగి టైటిల్ గెలుచుకునే సామర్థ్యం కలిగి ఉన్నదని చెప్పాడు.

2012లో ఫెడరేషన్ కప్ ను గోవాలోని డెంపోపై ఈస్ట్ బెంగాల్ గెలుపొందడంలో మోర్గాన్ సహకరించాడు. 2003లో ఆసియా కప్ విజేతలుగా, స్థానిక కలకత్తా ఫుట్ బాల్ లీగ్ లో సత్తా చాటినా జాతీయస్థాయిలో విజయం సాధించడంలో విఫలమవుతున్నదని పేర్కొన్నాడు. తిరిగి జట్టు చాంపియన్ గా నిలిచేందుకు ఇదే సరైన తరుణం అని పేర్కొన్నాడు.

జట్టు అభిమానులు సైతం తిరిగి ఐ - లీగ్ ను ఈస్ట్ బెంగాల్ జట్టు గెలుచుకోవాలని కోరుకుంటున్నారని వివరించాడు. నలుగురు మెరుగైన అంతర్జాతీయ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకుండా టైటిల్ సాధించడం చాలా కష్టసాధ్యమని తేల్చి చెప్పాడు. విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ఈస్ట్ బెంగాల్ యాజమాన్యం తనకు అనుమతిని ఇవ్వలేదని విచారం వ్యక్తంచేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+