కోల్‌కతాపై చెన్నయిన్ విజయం సా.....ధించింది

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా గురువారం కోల్‌కత్తా-చెన్నై జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీ 3-2తో అట్లెటికో డి కోల్‌కతాపై విజయం సాధించింది.
చెన్నయిన్ తరఫున ఆడిన జెజె లెప్లెక్లువా టీంను గెలిపించడంలో ప్రధాన పాత్ర వహించాడు. హోరాహోరీ పోరులో 65వ, 90వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టాడు. ఇతనితో పాటుగా 84 వ నిమిషంలో ఇనిగో కాల్డెరన్ ఓ గోల్ సాధించాడు.
ఈ మ్యాచ్ లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన కోల్‌కతా జట్టు చివరికి పరాజయం పాలైంది. కోల్ కత్తా ( అట్లెటికో డి) జట్టులో 77వ నిమిషంలో జెక్వినా గోల్ చేశాడు. 89వ నిమిషంలో జాజి కుకి గోల్ సాధించాడు. మొట్ట మొదటి గోల్ కోల్ కత్తానే చేసినా విజయం సాదించలేకపోయింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నయిన్‌కు ఇది మూడో విజయం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications